ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో రక్తదాన శిబిరం.
కామారెడ్డి,(భారత శక్తి ప్రతినిధి) ఆగస్టు 13: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కామారెడ్డి ఆధ్వర్యంలో, ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామారెడ్డి అధ్యాపకుల, విద్యార్థుల సహకారంతో, ఈ కాలేజీ పూర్వ విద్యార్థి కీర్తిశేషులు జెర్సీ బాల్రాజ్ గౌడ్ జ్ఞాపకార్థం కాలేజ్ ఆడిటోరియంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులకు , అధ్యాపకులకు అభినందనలు తెలియజేశారు. అవసరమన్న వారికి ఆపదలో రక్త దానం చేసి ప్రాణాలు కాపాడాలని, ముఖ్యంగా యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
About The Author
16 Aug 2025