పారిశుధ్య కార్మికుల సేవలు ప్రశంసనీయం
అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
సంగారెడ్డి : పారిశుధ్య కార్మికుల ఆరోగ్యము కి ప్రాధాన్యత ఇస్తున్నామని అదనపు కలెక్టర్ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు.. బుధవారం సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో పట్టణ ప్రజలకు సేవలను అందిస్తున్న పారిశుధ్య సిబ్బందికి వారి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని సబ్బులు, ఆయిల్, బెల్లం, టవల్ మరియు రెయిన్ కోట్ లు అందించారు. డ్రగ్స్ నిర్మూలన పైన ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి పట్టణ మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి, డి ఈ రఘు, మేనేజర్ సూర్య ప్రకాష్, సానిటరీ ఇన్స్పెక్టర్ కుమార్ , ఆంబోజి, శానిటేషన్ జవాన్ లు మరియు శానిటేషన్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.
About The Author
16 Aug 2025