భారీ వర్షాల దృష్ట్యా రానున్న 72 గంటలు హై అలర్ట్
అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు
పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్
మంచిర్యాల : రానున్న 72 గంటల పాటు రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించిందని భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనరేట్ పరిధిలోని ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఈరోజు ఒక ప్రకటనను విడుదల చేశారు. పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పోలీసు యంత్రాంగం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలియజేసారు. ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే, స్థానిక పోలీస్ అధికారులకు లేదా డయల్ 100కి ఫోన్ చేసి పోలీసు వారి సహాయం పొందగలరని తెలిపారు. అధికారుల సూచనలను పాటిస్తూ పోలీసు వారికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు
Read More మత్తుపదార్థ రహిత సమాజమే మనందరి లక్ష్యం
రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పోలీస్ శాఖ పరంగా తగిన ఏర్పాట్లతో ముందస్తుగా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని ప్రజలు పోలీసు వారి సూచనలు సలహాలు పాటిస్తూ సహకరించాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు,కాలువలు,నదులు, రిజర్వాయర్లు,చెరువుల వద్దకు వెళ్ళరాదు. చెట్ల కింద, పాడైన భవనాలు కింద, శిధిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండరాదు. విద్యుత్ స్థంభాలు, ట్రాన్స్ఫార్మర్స్ ముట్టుకోరాదు. ఎవ్వరు కూడా ఎట్టిపరిస్థితుల్లో కూడా చెరువులోకి, నాలాలు, డ్యామ్స్, వాటర్ ఫాల్స్ లేదా చేపల వేటకు గాని వెళ్ళరాదు. అత్యవసరమైతేనే ఇంటి నుండి బయటకు రావాలి. స్థానిక రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ, విద్యుత్, ఆర్&బి, వైద్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడైనా రోడ్ల పై వరద ఉదృతితో రోడ్లు తెగిపోయినా, ఉదృతంగా ప్రవహించినా అక్కడికి ఆ గ్రామ ప్రజలు వెళ్లకుండా, రెండు దిక్కులా ప్లాస్టిక్ కోన్స్,బారిగేడ్స్, హెచ్చరిక గల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది.
About The Author
16 Aug 2025