క్షేత్ర స్థాయి పోటీలకు అర్హత సాధించిన శిశుమందిర్ విద్యార్థులు
కరీంనగర్ ప్రతినిధి :
ఈ నెలలో భైంసా లో జరిగిన ప్రాంత స్థాయి (స్టేట్ లెవెల్) క్రీడా పోటీలలో శ్రీ సరస్వతీ శిశుమందిర్ హై స్కూల్, కరీంనగర్ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరచి అనేక విభాగాలలో విజేతలుగా నిలిచారూ. దక్షిణ మధ్య క్షేత్ర స్థాయి పోటీలకు ఎంపికై, కర్ణాటకలో జరగబోయే పోటీలలో పాల్గొనే అర్హత సాధించారు.యోగా అండర్ 17 విభాగంలో కాల్వ సాత్విక, అమ్ముల వనజ, బూధిరెడ్డి స్మైలి శ్రీ, వెల్దండి బాల త్రిపుర సుందరి తమ అద్భుతమైన క్రీడా నైపుణ్యంతో విజేతలుగా నిలిచారు.
యోగా అండర్ 14 విభాగంలో జీల వేదక్షరి, కానవేని శివాని, అడిదెల హర్షిత, మనుపాటి ప్రియ హర్షిణి, ఆదిపెల్లి రిశ్విత తమ ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సముద్రాల రాజమౌళి మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల జీవితంలో కేవలం శారీరక దృఢత్వాన్నే కాదు, మానసిక దృఢత, సమయపాలన, టీమ్‌వర్క్, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి. భవిష్యత్తు కెరీర్‌కి బలమైన పునాది అవుతాయి. జోనల్ లెవెల్‌లో కూడా ప్రతిభ కనబరచేందుకు తగిన అన్ని సదుపాయాలు అందిస్తున్నాము. కృషి, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం ఉంటే, క్రీడల ద్వారా దేశ స్థాయిలో కూడా మన పిల్లలు రాణించగలరని పేర్కొన్నారు.
విజేతలను డాక్టర్ చక్రవర్తుల రమణాచారి, ఇంజనీర్ కోల అన్నారెడ్డి, ఎలగందుల సత్యనారాయణ, డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్, పులాల శ్యామ్, గట్టు శ్రీనివాస్, రాపర్తి శ్రీనివాస్, డాక్టర్ నాళ్ళ సత్య విద్యాసాగర్, గోలి పూర్ణచందర్, కొత్తూరి ముకుందం, గట్టు రాంప్రసాద్, నడిపెల్లి దీన్ దయాల్ రావు, అప్పిడి వకులాదేవి తదితరులు అభినందించారు.