వేములవాడ,ఆగస్టు 14 (భారత శక్తి ) : వేములవాడ పట్టణంలోని సాయి నగర్ ఉప్పగడ్డ వీధిలోగల కేరళ మోడల్ స్కూల్ లో కృష్ణాష్టమి పురస్కరించుకొని గురువారం రోజున ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు పలువురు విద్యార్థులు శ్రీకృష్ణ గోపిక వేషధారణలతో ఉట్టి కొడుతూ, పిల్లనగ్రోవి ఊదుతూ విద్యార్థులు సందడి చేశారు. తమ పిల్లలను వేషధారణలను చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు. విద్యార్థులు చేసిన నృత్యాలు, భక్తి పాటలు, కృష్ణుడి జీవితాన్ని వర్ణించే నృత్య నాటకాలను ప్రదర్శించడం పలు కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి, కృష్ణుడి వెన్నెత్తినే సన్నివేశం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం ఏర్పాటు చేసిన దహి హుండి పుట్టి కొట్టేందుకు విద్యార్థులు పోటుపడ్డారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మనోజ్ సతి మాట్లాడుతూ కృష్ణ జన్మాష్టమి వంటి పండుగలను జరుపుకోవడం వల్ల విద్యార్థులు భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వం విలువలను అభినందించడానికి సహాయపడుతుందని తెలిపారు. అలాగే ప్రతి సంవత్సరం నిర్వహించే మాదిరిగానే పాఠశాల కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయులు సతీ మనోజ్ కుమార్ తెలిపారు.అందరికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందంతో పాటు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.