మద్యం మత్తులో పరస్పర దాడులు ఏడుగురు అరెస్టు

టౌన్ ఏసీపీ రమణమూర్తి

IMG-20250814-WA0076
ఖమ్మం ప్రతినిది (భారత శక్తి న్యూస్ ), ఆగష్టు 14:మద్యం మత్తులో ఇరువర్గాలు రెచ్చిపోయి పరస్పర దాడులకు తెగబడిన ఘటనలో 11 మందిపై కేసులు నమోదు చేసి ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు టౌన్ ఏసీపీ రమణమూర్తి తెలిపారు.
బుధవారం రాత్రి ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాలపురంలో మద్యం తాగిన మత్తులో రాకేష్ అనే వ్యక్తి రోడ్డుపై అడ్డంగా పడుకోవడంతో రాకేష్ భార్య దుర్గ భవానితో సమీపంలో దుకాణం నడుపుతున్న కవిత, వేణుగోపాల్ వరించడంతో మొదలైన గొడవ, పాత కక్షలు కూడా తోడు కావడం, కొంతమంది ఆకతాయిలు జత కావడంతో పరస్పరం దాడులు చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో ఆకతాయిల బ్యాచ్ పెట్రోల్ తెచ్చి షాపు ఎదుట వున్న వస్తువులపై పెట్రోల్ పోసి నిప్పు అంటించిగా పక్కన పార్క్ చేసిన స్కూటీ పాక్షికంగా తగలబడిందని తెలిపారు. దాడుల పాల్పడిన నేపథ్యంలో పరస్పరం ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకోవడంతో ఇరువురిపై కేసులు నమోదు చేసి విచారణ అనంతరం ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్ తరలించామని అన్నారు. మరో ఇద్దరు హాస్పటల్ లో చికిత్స పొందుతూన్నారని, ఇద్దరు పరారీ వున్నారని పేర్కొన్నారు.
 
మాదక ద్రవ్యాలు ఏమైనా స్వికరించరా? లేదా తెలుసుకునేందుకు గంజాయి కిట్ ద్వారా అందరికి మూత్ర పరీక్షలు నిర్వహించి,గంజాయి. మాదక ద్రవ్యాలు తీసుకోలేదని నిర్ధారించారు. గంజాయి తీసుకునే వ్యక్తులకు 15 రోజుల వరకు మూత్ర పరీక్షలలో తెలుసుకునే అవకాశం వుంటుందని ఈ సందర్బంగా తెలిపారు.
రుదావత్ దుర్గా భవానీ ఫిర్యాదుతో ఏ 1 గోపాల్, ఏ 2 వేణు,ఏ 3 వినోద్,ఏ 4 లక్ష్మి, ఏ 5 కవిత.
బానోత్ వేణు ఫిర్యాదు తో ఏ 1 రాకేష్,ఏ 2 శ్రీనాధ్, ఏ 3 మహేష్
ఏ 4 ఉమేష్,ఏ 5 వరుణ్ తేజ,ఏ 6 కార్తీక్ లపై కేసులు నమోదు చేశారు.
ముఖ్యంగా ఎలాంటి ఆధారాలు, నిర్ధారణ లేకుండా గంజాయి మత్తులో దాడులు చేశారని, సంభంధిత పోలీస్ అధికారుల వివరణ లేకుండా పత్రికల్లో ప్రచురించి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని సూచించారు.

About The Author