హత్యాయత్నం కేసులో నిందుతులకు ఐదేళ్లు జైలు

 IMG-20250814-WA0073

వేములవాడ, ఆగస్టు 14 భారత శక్తి) : హత్యాయత్నం కేసులో ఆరుగురు నిందితులకు ఐదు సంవత్సరాల జైలు శిక్షతో పాటు 500 రూపాయల జరిమానా విధిస్తూ అసిస్టెంట్ స్టేషన్ కోర్టు న్యాయమూర్తి అజయ్ కుమార్ యాదవ్ గురువారం రోజున తీర్పు వెల్లడించినట్లు వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్ తెలిపారు.చంద్రగిరి గ్రామానికి చెందిన ముత్త ఎల్లయ్య అతనికి కొడుకు శరత్ 2020 సంవస్సరం 12వ నెల 20వ తేదీన తమ పోలము దున్నుతుండగా తన భూమి పక్కన గల అదే గ్రామానికి చెందిన దేశావేని లింగయ్య,దేశవేని కనకరాజు,దేశవేని శ్రీనివాస్, దేశవేని కనకవ్వ,దేశవేని సరోజన, చోక్కల్ల తిరుమల్లు భూమి విషయంలోని పాత గొడవలు మనసులో పెట్టుకుని దేశవేని లింగయ్య,కనకరాజు, శ్రీనివాస్, కనకవ్వ,సరోజన,తిరుమల్లు అనే వ్యక్తులు ఎల్లయ్య కొడుకు శరత్ పై దాడి చేయగా శరత్ తీవ్ర రక్త గాయం కాగా చికిత్స నిమిత్తం సిరిసిల్ల హాస్పిటల్ కి తరలించి, వేములవాడ పోలీస్ స్టేషన్ లో ఎల్లయ్య పిర్యాదు చేయగా అప్పటి సీఐ వెంకటేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం నిందితులను అరెస్టు చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయగా సిఎమ్ ఎస్. ఎస్.ఐ రవీంద్రనాయుడు, కానిస్టేబుల్ మధుసూదన్, కోర్టు కానిస్టేబుల్ సురేశ్ లు కోర్టులో సాక్ష్యులను ప్రవేశపెట్టగా ప్రాసిక్యూషన్ తరుపున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజీ రెడ్డి వాధించగా కేసు పూర్వపాలను పరిశీలించిన అసిస్టెంట్ సెషన్ కోర్టు న్యాయమూర్తి అజేయ్ కుమార్ జాధవ్ ఆరుగురు నిందుతులకు ఐదు సంవత్సరాల జైలు శిక్షతో పాటు 500 రూపాయల జరిమాన విధించినట్లు వేములవాడ టౌన్ సి.ఐ వీర ప్రసాద్ తెలిపారు. పైకేసులో నింధితులకు శిక్ష పడేలా కృషి చేసిన అప్పటి విచారణ అధికారులు సి.ఐవెంకటేష్,ప్రస్తుత సి.ఐ వీరప్రసాద్,పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజీ రెడ్డి, సిఎమ్ఎస్. ఎస్.ఐ రవీంద్రనాయుడు, సిఎమ్ఎస్. కానిస్టేబుల్ మధుసుదన్,కోర్ట్ కానిస్టేబుల్ సురేష్ లను జిల్లా ఎస్పీ మహేష్ బి గితే ప్రత్యేకంగా అభినందించారు.

Read More భారీ వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి..

About The Author