నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం..

WhatsApp Image 2025-08-13 at 6.44.50 PM

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో : నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల. ఆదేశాల మేరకు, ఈరోజు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో "నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం" లో భాగంగా, మాదకద్రవ్యాల దుర్వినియోగ నిర్మూలన” పై ఒక విశేషమైన సామూహిక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.

Read More తమ తప్పులను తెలుసుకోలేక ఎన్నికల కమిషన్ పై ఆరోపణలు చేస్తున్న ఇండియా కూటమి

ఈ కార్యక్రమంలో భాగంగా, పోలీస్ అధికారులు, సిబ్బంది స్థానిక పాఠశాలల్లో, కళాశాలల్లోని విద్యార్థులతో, ఉపాధ్యాయులతో మరియు గ్రామాల్లో పట్టణాల్లో,బస్టాండుల్లో, ప్రజల చేత “మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా,మాదక ద్రవ్యాల పై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ రహిత సమాజాన్ని అనుసరిస్తానని ప్రజలతో సామూహిక ప్రతిజ్ఞ” చేయించారు. ప్రతిజ్ఞలో తమ జీవితంలో ఎప్పుడూ మాదకద్రవ్యాలు వాడబోమని, వాటి వినియోగాన్ని ప్రోత్సహించబోమని, సమాజం మత్తు రహితంగా ఉండేలా చైతన్యం కల్పిస్తామని ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేశారు.

Read More  దాసరి వాడలో పోచమ్మ బోనాలు సమర్పించిన భక్తులు

ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది మాట్లాడుతూ..ప్రజలకు మాదకద్రవ్యాల వాడకంతో కలిగే ఆరోగ్య నష్టం, కుటుంబాలకు, సమాజానికి కలిగే దుష్పరిణామాలను వివరించారు. యువతను ఈ మాదకద్రవ్యాల మత్తు నుండి దూరంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అందుకు అందరూ ఒకే తాటిపై నిలిచి పోరాడాలని పిలుపునిచ్చారు.

Read More డంపింగ్ యార్డ్ సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం.

అలాగే మాదకద్రవ్యాల వ్యాపారం, రవాణా లేదా వినియోగం గమనించిన వెంటనే పోలీస్ అధికారులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు. మాదకద్రవ్య రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఒకవేళ ఎవరైనా మాదకద్రవ్యాల వ్యాపారం గానీ,రవాణా లేదా వినియోగం గమనించిన వెంటనే 100 నంబరుకు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వండి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీసులతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు, యువత,మహిళలు గ్రామాల్లోని ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Read More ఉద్యోగుల సంక్షేమానికి హెల్త్ స్కీమ్ అవసరం.

About The Author