
కామారెడ్డి : వరుసగా ప్రజా క్షేత్రంలో ఓటమి పాలవుతూ తమ తప్పులను తెలుసుకోలేక ఎన్నికల కమిషన్ పై ఆరోపణలు చేస్తున్న ఇండియా కూటమి, రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఎం పి లు చేస్తున్న అర్థ రహిత ఆరోపణల విషయంలో బీజేపీ జిల్లా కార్యలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ, దేశ ప్రయోజనాలే లక్ష్యంగా, ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పని చేస్తున్న బీజేపీ గత మూడు పార్లమెంట్ ఎన్నికలలో, సగానికి పైగా రాష్ట్రాల్లో ప్రజల మన్ననలు పొంది అధికారంలోకి వస్తే ప్రజల మధ్య కులాల వారిగా మతాల వారిగా చిచ్చు పెడుతూ ఎప్పటికప్పుడు దేశంపై, సైనికులపై, హిందువులపై తన అక్కసును కక్కుతూ, ప్రజల చీత్కారాలకు గురవుతూ, కూడా ప్రజల నాడి తెలుసుకోకుండా ఇవిఎం లను తప్పు పడుతూ ఇప్పుడు కొత్తగా ఎన్నికల సంఘం పైనే ఆరోపణలు చేస్తున్న రాహుల్ గాంధీ సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ బద్ధమైన సంస్థపై ఆరోపణలు చేయటం విడ్డూరం అని అన్నారు.
నరేంద్ర మోదీ సారధ్యంలో బీజేపీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజల్లో ఆదరణ రోజు రోజుకి పెరుగుతుండటం వల్లే రాహుల్ గాంధీ, ఇండియా కూటమి పార్టీలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. కర్ణాటక, తెలంగాణలో గెలిచినప్పుడు ఇవిఎం లపై కానీ, ఎన్నికల సంఘంపై కానీ ఆరోపణలు చేయని కాంగ్రెస్, ఓటమి చెందినప్పుడు మాత్రం ఇవిఎం లపై ఆరోపించడం సిగ్గుచేటు అని అన్నారు. ఎలాంటి అనుమానాలు ఉన్నా లిఖిత పూర్వకంగా రాసి ఇస్తే చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం స్పష్టం చేసినప్పటికీ కావాలనే ఆరోపిస్తూ ప్రజలను, మీడియాను తప్పు తోవ పట్టిస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్, బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు వేణు, నాయకులు సురేష్, సంతోష్ రెడ్డి, రవీందర్, రాజేష్, రాజ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.