అలసత్వం వద్దు..
అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఆదేశించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా.
రాజన్న సిరిసిల్ల :
ప్రజల సమస్యలే పరిష్కార పరిష్కారకంగా తీసుకున్న ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన బాధితుల సమస్యలపై అధికారులు అలసత్వం ప్రదర్శించవద్దని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు.సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణికి మొత్తం 114 దరఖాస్తులు వచ్చాయని అందులో రెవెన్యూ శాఖకు 36, గృహ నిర్మాణ శాఖకు 26, డీఆర్డీఏ 20, ఉపాధి కల్పన శాఖకు 7, పంచాయితీ, సంక్షేమ శాఖలకు 5 చొప్పున, పౌర సరఫరాల శాఖకు 4, సెస్ కు 3, ఎస్డీసీ, మున్సిపల్ కమీషనర్ సిరిసిల్ల కు 2 చొప్పున, వ్యవసాయ, వైద్యారోగ్య, విద్యా శాఖ, ఎస్పీ కార్యాలయానికి ఒకటి చొప్పున దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.