దాసరి వాడలో పోచమ్మ బోనాలు సమర్పించిన భక్తులు


ఉమ్మడి వరంగల్ బ్యూరో : గ్రేటర్ వరంగల్ 5 వ డివిజన్ దాసరివాడలో పోచమ్మ బోనాలను దాసరివాడ కాలనీ వాసులు భక్తి శ్రద్ధలతో బోనాలు బుధవారం రాత్రి
సమర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ పోతుల శ్రీమాన్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అంటువ్యాధులు రాకుండా కాపాడుకోవడానికి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారని ఆ తల్లి దీవెనలతో జిల్లా ప్రజలంతా,దాసరివాడ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
About The Author
06 Dec 2025
