అనర్హులను తొలగించి అర్హులకు డబ్బులు బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలి..

కామారెడ్డి :

డిమాండ్ చేసిన సిపిఎం జిల్లా కార్యదర్శి కె చంద్రశేఖర్.. 

WhatsApp Image 2025-08-11 at 6.09.32 PM

కామారెడ్డి జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ల పంపిణీలు  అనర్హులకు ఇల్లు కేటాయించారని అన్నారు. ప్రధానంగా బిక్నూర్ మండల కేంద్రంలో జరిగిన ఇండ్ల పంపిణీలో  అనర్హులు ఉన్నారని అధికారులు రాజకీయ నాయకులకు   వత్తాసు పలుకుతూ అర్హులకు కేటాయించకుండా అనర్హులకు ఇండ్లు కేటాయించారని సోమవారం జిల్లా కలెక్టర్ కి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొత్త నరసింహులు ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు. స్పందించిన కలెక్టర్ హౌసింగ్ జిల్లా అధికారిని వెంటనే  రీ ఎంక్వయిరీ చేసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ ఏ విధంగా జరిగిందో వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. బిక్నూర్ గ్రామస్తులు ఇండ్లు లేనివారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇళ్ల స్థలాల కోసం ఆందోళన పోరాటాలు కొనసాగించాలని అర్హులకు ఇవ్వకుండా ఇండ్లున్నవారికి  ఉద్యోగులకు కేటాయించడం సరైంది కాదన్నారు. ప్రస్తుత కామారెడ్డి ఎమ్మెల్యే  సైతం అభ్యంతరం తెలిపినట్టు ఆయన గుర్తు చేశారు. అర్హులైన పేద ప్రజలకు న్యాయం జరిగే వరకు ఆందోళన పోరాటాలు కొనసాగిస్తామని ఆయన అన్నారు. 

Read More యూరియా కొరతతో రైతులు అల్లాడుతున్నారు

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొత్త నరసింహులు, నాయకులు రహిమ, హైమ, బేగం, పుష్ప, మంజుల, భాష, లక్ష్మి, నజియా,  తదితరులు పాల్గొన్నారు.

Read More దేశంలో ఈసీ ఓట్ల దొంగ‌త‌నం ప్ర‌జాస్వామ్యానికి అవ‌మానం..

About The Author