సంగారెడ్డి, భారత శక్తి ప్రతినిధి, ఆగస్టు 14: జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వాగులు వంకలు పొంగి పొర్లు తున్నాయని ఈ వరదల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య అన్నారు. జిల్లా ఎస్పీ పరి తోష్ పంకజ్ తో కలిసి కలెక్టర్ జహీరాబాద్ నుండి బూచినెల్లి గ్రామం వెళ్లే మార్గంలో ఉన్న బ్రిడ్జిని కలెక్టర్ పరిశీలించారు.నారింజ వాగు నుండి వచ్చే వరదను ఎస్పీతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులు, నారింజవాగు పరివాహక ప్రాంతం వివరాలను తెలిపే మ్యాపు ద్వారా కలెక్టర్కు వరద ఉధృతిని వివరించారు. భారీ వర్షాల కారణంగా జహీరాబాద్ న్యాల్కల్ తదితర ప్రాంతాల్లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఆయా ప్రాంతాలలో స్థానిక పరిస్థితులను కలెక్టర్ ఎస్పీలు సమీక్షించారు.భారీ వర్షాలు ఈదురుగాలును వరద ప్రవాహాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా నదులు ,వాగులు ,చెరువులు, కల్వర్టులు, బ్రిడ్జ్ ల వద్దకు ప్రజలు వెళ్లకూడదని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితులలో తప్ప , ప్రయాణాలు చేయకూడదని సూచించారు . అన్ని శాఖల అధికారులు సిబ్బంది, తమ కార్యస్థానాలలో అందుబాటులో ఉండి ప్రజలకు తక్షణ సహాయక చర్యలు అందించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు , గాలులు ఎక్కువగా ఉన్న సమయంలో విద్యుత్ స్తంభాలు వైర్లు ట్రాన్స్ఫార్మర్లు తాకరాదని కరెంటు ప్రమాదాల నుండి రక్షణ కోసం అందరూ సరైన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్పీలు న్యాల్కల్ మండలం నారింజ వాగుకు వర్షానికి వచ్చే వరదను కలెక్టర్ ఎస్పీలు పరిశీలించారు. నారింజ ప్రాజెక్టు నీటి సామర్థ్యం ఎంత ఉంది అని అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు వాగు దగ్గరికి ఎవరు రాకుండా చర్యలు తీసుకోవాలని నేటిపారుదల శాఖ అధికారులకు ఆదేశించారు.వాగు కు వరద ఏ ప్రాంతాల నుండి వస్తుంది వరద ఉధృతి ఎంత ఉండొచ్చు అనే విషయాలను నీటిపారుదల శాఖ అధికారులు నరింజ వాగు ప్రవహించే ఏరియా ను మ్యాపు ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా మండలంలోని రాయిపల్లి గ్రామ శివారులోని జాతీయ రహదారి బ్రిడ్జిలు జిల్లా కలెక్టర్ ఎస్పీలు నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు.
వర్షాల కారణంగా ఎక్కడైనా అడ్డంకులు రహదారిలో దెబ్బతినే ప్రమాదం ఉంటే వెంటనే సమాచారం అందించాలని సూచించారు. భారీ వర్షాలు దృష్ట్యా కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తిన వర్షాల వల్ల ఇబ్బందులు కలిగిన వరద పరిస్థితిలో ఉంటే వెంటనే కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ నెంబర్ 08455 - 276155 కు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య , బూచి నెల్లి అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించారు. గ్రామంలో గర్భిణీ స్త్రీలను గుర్తించి వర్షాల కారణంగా అనుకోని అత్యవసర పరిస్థితులు తలెత్తకుండా ముందుగానే వారిని సమీప ఆసుపత్రులకు తరలించాల్సిందిగా ఆరోగ్య సిబ్బందికి సూచించారు.ఈ సందర్భముగా జహీరాబాద్ ఆర్డీఓ రాం రెడ్డి , తహసీల్దార్ దశరథ్ ,నీటి పారుదల శాఖ అధికారులు ,రెవెన్యూ అధికారులు ,పంచాయతీరాజ్ అధికారులు వెంట ఉన్నారు.