ఆరోగ్య తెలంగాణ సాధించడమే లక్ష్యం..
వేములవాడ : ఆరోగ్య తెలంగాణ సాధించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్హులైన 40 మంది లబ్ధదారులకు 12 లక్షల 93 వేల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిది చెక్కులను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మెడికల్ హబ్‌గా మారిందన్నారు. వైద్యారోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి, ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా మారిందని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచి ప్రజా ఆరోగ్య భద్రతపై ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని చాటుకున్నారని తెలిపారు.మన ప్రాంతంలో వివిధ ఆరోగ్య సమస్యలతో చికిత్స తీసుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వార, ఎల్ఓసి ల ద్వారా ఇప్పటి వరకు 22 కొట్లు పై చిలుకు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.గత ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా10 సంవత్సరాలలో 400 కోట్లు పంపిణీ చేస్తే ప్రజా ప్రభుత్వ ఏర్పడిన నాటినుండి నేటి వరకు 800 కోట్ల మేర లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.