ఉమ్మడి వరంగల్ బ్యూరో(భారత శక్తి)ఆగష్టు14: మత్తు పదార్థ రహిత సమాజం కొసం అందరం సమిష్టిగా పనిచేద్దామని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు పిలుపు నిచ్చారు. నెలవారి నేర సమీక్షా సమావేశాన్ని కాకతీయ విశ్వవిద్యాలయము సమావేశ ప్రాంగణంలో గురువారం నిర్వహించారు. వరంగల్ కమిషనరేట్ చెందిన పోలీస్ అధికారులు పాల్గోన్న ఈ సమీక్షా సమావేశంలో పోలీస్ కమిషనర్ ముందుగా సుధీర్ఘ కాలంగా పెండింగ్‌లో వున్న కేసులను సమీక్ష జరిపడంతో పాటు పెండింగ్‌కు గల కారణాలను పోలీస్ కమిషనర్ సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు కేసుల పరిష్కారం కోసం అధికారులు తీసుకోవాల్సిన చర్యలను పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ మత్తు పదార్థాల నియంత్రణకై విద్యా సంస్థల పరిసరాలతో పాటు, నిర్మానుష్య ప్రదేశాలపై పోలీస్ అధికారులు నిఘా పెట్టాల్సి వుంటుందని. ముఖ్యంగా పోలీస్ అధికారులు వారివారి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, ఈ.సిగిరెటు వినియోగంపై నిషేధం అమలులొ వున్నందును ఈ. సిగిరేట్ల వినియోగంపై పోలీసులు నిఘా పెట్టాలని, గంజాయి కేసుల్లోఅధికారులు ప్రధాన నిందితుల అరెస్టుకై ప్రత్యేక చోరవ చూపాల్సి వుంటుందని. నేరాల నియంత్రణకై పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజల భాగస్వాయ్యంతో సిసి కెమెరాల ఏర్పాటుకై కృషి చేయడంతో సిసి కెమెరాల వినియోగం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, మద్యం దుకాణాల్లో తప్పని సరిగి సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోనే విధంగా మద్యం దుకాణాల యజమానులను అదేశించాలని. చోరీ కేసులకు సంబంధించి ప్రస్తుతం పరారీలో వున్న నిందితులను పట్టుకొనేందుకుగాను సిసిఎస్ పోలీస్, స్థానిక పోలీసులు సంయుక్తంగా కల్సి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్ అధికారులను అదేశించారు. పోలీస్ స్టేషన్ల పనీతీరుపై సిపి మాట్లాడుతూ ప్రతి స్టేషన్‌లోని మహిళా పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్ సంబంధించి అన్ని రకాల విధుల్లోను వారిని వినియోగించుకోవాల్సి వుంటుందని. ముఖ్యంగా సిబ్బంది యోగ క్షేమాల పట్ల అధికారులు దృష్టి సారించాలని. వారికి ఎదైన వ్యక్తిగత లేదా శాఖపరమైన సమస్య వుంటే సమస్య పరిష్కారం కోసం సంబంధిత అధికారులు కృషి చేయాలని సిపి సూచించారు.
ఈ సమావేశంలో డిసిపిలు షేక్ సలీమా, రాజమహేంద్రనాయక్, అంకిత్‌కుమార్, వరంగల్ , జనగాం ఏఎస్పీలు శుభం, చేతన్‌నితిన్, అదనపు డిసిపిలు రవి,ప్రభాకర్‌రావుతో పాటు ఏసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, ఎస్.ఐలు పాల్గోన్నారు.