అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు కేటాయించాలి.

ప్రభుత్వ విప్ ఆది.

WhatsApp Image 2025-08-12 at 6.34.59 PM

వేములవాడ :  వేములవాడ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారగా, వెంటనే నిధులు మంజూరు చేయాలని సంబంధిత అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనుల్లో భాగంగా సోమవారం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు. కథలాపూర్,మేడిపల్లి, భీమవరం మండలాల వరద ప్రాధాన్యాన్ని కలికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాలువల నిర్మాణానికి భూసేకరణ నిధులను విడుదల చేయవలసిందిగా కోరారు,ఇప్పటికే గత పది రోజుల క్రితం 10 కోట్ల నిధులు విడుదల చేయడం జరిగిందని, మరిన్ని నిధులు విడుదల చేస్తే కుడి ఎడమ కాలువల నిర్మాణం పూర్తవుతుందని ముఖ్యమంత్రికి ప్రభుత్వ విప్ వివరించారు. ఆనాడు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే ప్రాజెక్టు పనిని ప్రారంభించి నేడు మత్తడి నిర్మాణం పూర్తి చేసుకున్నామని ప్రస్తుతం కట్ట పనులు శరవేగంగా  కొనసాగుతాయని పేర్కొన్నారు. కుడి ఎడమ కాలువల నిర్మాణం పూర్తయితే సుమారు 43 వేల ఎకరాల సాగునీరు అందించడం జరుగుతుందని తెలిపారు. స్పందించిన సీఎం రెండు విడుదలగా నిధులు మంజూరు చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి వెంటనే ఆదేశాలు జారీ చేశారు. తెలిపిన వెంటనే నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. అలాగే చందుర్తి మోత్కరావుపేట రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే అటవి శాఖ అనుమతులు వచ్చి ఉన్నాయని,రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు నిర్మాణానికి 7 కోట్ల పైచిలుకు నిధులు కేటాయించిందని, రోడ్డు నిర్మాణం పూర్తవడానికి మరో 10 కోట్ల అవసరం ఉందని, కోనరావుపేట మండల పరిధిలోని మూలవాగు పెంటివాగులపై బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు,మూల వాగు, పెంటి వాగు పై ప్రత్యేకంగా ఈ గ్రామాల మధ్య బ్రిడ్జిల నిర్మాణానికి దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. బావుసాయిపేట-వెంకట్రావుపేట గ్రామాల మధ్య,మామిడిపెల్లి- నిజామాబాద్ గ్రామాల మధ్య, వట్టిమల్ల-నిమ్మపెల్లి ,వెంకట్రావుపేట -కొండాపూర్ గ్రామాలలో బ్రిడ్జిల నిర్మాణాన్ని చేయవలసిందిగా ముఖ్యమంత్రిని కోరగా హమ్ స్కీములో సంబంధిత బ్రిడ్జి లా నిర్మాణం చేపడతానని ముఖ్యమంత్రి  హామీ ఇచ్చినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు.

Read More భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

About The Author