బాలికల రెసిడెన్షియల్ లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..
వేములవాడ,ఆగస్టు 12 (భారత శక్తి) : విద్యార్థులకు నాణ్యమైన బోధనతోపాటు, మెనూ ప్రకారం భోజనం అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని,మహాత్మా జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ గర్ల్స్ విద్యాలయాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కిచెన్ స్టోర్ రూమ్ లలో తిరిగి, స్వయంగా గరిటతో వంటకాలను కలిపి వాటి నాణ్యతను, ల్యాబ్, లైబ్రరీ, ఆట స్థలమును పరిశీలించారు. విద్యార్థులతో హాస్టల్ వసతులు నాణ్యమైన భోజనం పెడుతున్నారా, అని విద్యార్థులను సౌకర్యాలు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అలాగే విద్యాలయంలోని 9,10, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫిజిక్స్, మ్యాథ్స్ ఎకనామిక్స్, ఇంగ్లీష్ పాఠాలను బోధించి పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. కొందరు టీచర్లు, విద్యార్థులకు, సక్రమంగా పాఠాలు బోధించలేకపోవడం గమనించి, వారికి సూచనలు చేశారు, అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతు క్లాస్ రూమ్ కి వెళ్లే ఉపాధ్యాయులు ముందుగా సంబంధిత సబ్జెక్టు పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. విద్యార్థులకు సక్రమంగా పాఠాలు బోధించాలని ఆదేశించారు.
