రసాయన బొమ్మలు వద్దు.. మట్టి వినాయకుడే ముద్దు

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

IMG-20250814-WA0080

ఎల్బీనగర్, ఆగష్టు 14 (భారత శక్తి):రాబోయే వినాయక చవితి సంధర్భంగా పీ&టీ కాలనీ నందు గణేష్ యువభక్త మండలి ఆధ్వర్యంలో దాదాపు 40 ఫీట్ల మట్టి గణపతి నిర్మాణ పనుల కార్యక్రమంలో గురువారం ముఖ్యఅతిథిగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పరిశీలించారు.అనంతరం మాట్లాడుతూ, ప్లాస్టర్ అఫ్ పారిస్ విగ్రహాలతో పర్యావరణానికి హాని జరుగుతుందని, నియోజకవర్గ పరిధిలోని సుమారు 90,000 ఇండ్లలో గణపతిని పూజించే వారంతా మన పురాతన, శాస్ట్రోతమైన సంప్రదాయ మట్టి వినాయకులను పూజించాలని, రసాయన రంగులతో కూడిన ప్లాస్టర్ అఫ్ పారిస్ తో తయారు చేసిన విగ్రహాలు నీటిలో కరగవు. అదే మట్టితో చేసిన విగ్రహాలు అయితే వెంటనే రెండు లేదా మూడు గంటలలో కరగడం జరుగుతుంది.పర్యావరణ హితం కోరే ప్రతి ఒక్కరు మట్టి వినాయక ప్రతిమలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు.మనలో ప్రతి ఒక్కరు మట్టి గణపతి విగ్రహాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు.మన పూర్వీకులు చెరువు మట్టితో వినాయక విగ్రహాన్ని తయారుచేసి తిరిగి అదే చెరువులో నిమజ్జనం చేసేవారని,మన పండుగల్లోని పరమార్థం.మన ఆరోగ్యం, ప్రకృతిని కాపాడుకోవడమేనని తెలిపారు.

Read More  దాసరి వాడలో పోచమ్మ బోనాలు సమర్పించిన భక్తులు

    రాబోయే వినాయక చవితి సందర్భంగా మేము చేసే సూచన ఏమిటంటే కాలనీ సంక్షేమ సంఘాలు, అపార్టుమెంట్లు,యువజన సంఘాల వారు మీరు ప్రతిష్టించే విగ్రహాలు మట్టి విగ్రహాలుగా ఎంచుకొని పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని కోరారు. ప్రతి ఒక్కరు రాబోయే రోజుల్లో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తాము చేపడుతున్న కార్యక్రమాలు సహృదయంతో స్వీకరించి ఆచరించినప్పుడే అన్నివిధాలా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్, రవి ముదిరాజ్, విక్కీ, ప్రదీప్, సింగిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి కమిటీ సభ్యులు నారాయణ రావు,రాంకుమార్ రాజు, నాగేశ్వరరావు,శ్రీనివాస్ రావు,జ్ఞానేంద్ర రావు, స్వామియాదవ్,రాజేష్ యాదవ్,నవీన్,శేఖర్ యాదవ్,శ్రీనివాస్ రెడ్డి,శ్రీనివాస్ యాదవ్, సత్యం తదితరులు పాల్గొన్నారు.

Read More ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సిటిజన్ చార్ట్ ను కచ్చితంగా ప్రదర్శించాలి.

About The Author