ఉద్యోగుల సంక్షేమానికి హెల్త్ స్కీమ్ అవసరం..
కరీంనగర్ ప్రతినిధి :
రాష్ట్ర మంత్రి దుద్దిళ్లకు వినతిపత్రం అందించిన టీఎన్జీవోలు
కరీంనగర్‌లోని శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (సుడా) కార్యాలయంలో కరీంనగర్ జిల్లా టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి ఆద్వర్యంలో గౌరవ ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ మాత్యులు అడ్లురి లక్ష్మణ్ కుమార్ టీఎన్జీవోల సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా బొకే అందజేశారు. ఈ సందర్భంగా, సంఘ ప్రతినిధులు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను, బెనిఫిట్స్ చెల్లింపుల ఆలస్యం హెల్త్ స్కీమ్ అమలు అవసరాన్ని వివరించారు. గత కొంతకాలంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల బెనిఫిట్స్ (గ్రాట్యుటీ, పెన్షన్ మొదలైనవి) అందడంలో ఆలస్యం జరుగుతుండటం, అలాగే హౌస్ బిల్డింగ్ లోన్స్, జి.పి.ఎఫ్. లోన్స్, టి.ఏ. బిల్లులు, జి.ఎల్.ఐ. బిల్లులు, వైద్య ఖర్చుల బిల్లులు వంటి చెల్లింపులు సకాలంలో అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణ కోసం కాంట్రిబ్యూషన్ ఆధారిత ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌ను త్వరితగతిన రూపొందించి అమలు చేయడం అవసరమని సంఘం నాయకులు సూచించించారు. ఈ పథకం ద్వారా ఉద్యోగులకు అత్యవసర వైద్య సాయం అందించబడుతూ, వారి ఆరోగ్య భద్రత మరింతగా బలపడుతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని మేము విశ్వసిస్తున్నామని. మా సమస్యలను కూడా సానుకూలంగా పరిశీలించి త్వరగా పరిష్కరించగలరని ఆశిస్తున్నాంని టీఎన్జీవోల సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు హామీఇచ్చారు.