ప్రజల ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ డా: జి.జానకి షర్మిల.

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం

WhatsApp Image 2025-08-13 at 6.17.14 PM

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా :నిర్మల్ ఎస్పీ డా. జి. జానకి షర్మిల, బుధవారం భైంసా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భైంసా సబ్‌డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన 11 మంది ఆర్జిదారుల ఫిర్యాదులను స్వీకరించి, ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించారు.

Read More అంగన్ వాడి కేంద్రాల ఆకస్మిక తనిఖీ..

ఫిర్యాదు దారుల ఎదుటే సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, బాధితులకు చట్టపరంగా అవసరమైన సహాయాన్ని వెంటనే అందించాలని సూచించారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Read More మాదకద్రవ్యాల ప్రమాదాలపై భైంసాలో అవగాహన సదస్సు..

కుటుంబ వివాదాల పరిష్కారంలో ‘షీ టీం’ పాత్ర: ఈ కార్యక్రమంలో వచ్చిన కొన్ని కుటుంబ సమస్యలపై షీ టీం సిబ్బంది ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించారు. కౌన్సిలింగ్ ద్వారా కుటుంబాలు తిరిగి కలుసుకోవడం జరిగింది. ప్రజలు "నిర్మల్ వరకు రావడం కష్టంగా ఉండగా, భైంసాలోనే కౌన్సిలింగ్ కల్పించడం పై ఎస్పీ  చూపిన ఆలోచనను బాధితులు సంతృప్తిని వ్యక్తం చేశారు.

Read More అక్రమంగా ఇసుక తరలిస్తున్న వ్యక్తి రిమాండ్.

పెండింగ్ ఫిర్యాదులపై సమీక్ష: ఈ సందర్భంగా గతంలో గ్రీవెన్స్‌లో వచ్చిన ఫిర్యాదుల పరిష్కార స్థితి, ఇంకా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని పెండింగ్ లో ఉన్న వాటిని వేగంగా పరిష్కరించాలన్నారు.

Read More విద్యార్థులు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి

About The Author