రూరల్ ఏసీపీ, వన్ టౌన్ సీఐలకు టీఎన్జీవోల శుభాకాంక్షలు

IMG-20250814-WA0030కరీంనగర్ ప్రతినిధి, ఆగస్టు 14(భారత శక్తి): టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, వన్‌టౌన్ సీఐ ఎల్. రామచంద్రరావులు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గురువారం వారిని మర్యాద పూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
భవిష్యత్తులో ప్రజాసేవలో మరింత ప్రతిష్టాత్మకంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ
కార్యక్రమంలో టీఎన్జీవోల సంఘం జిల్లా కార్యదర్శి సంఘం లక్ష్మణరావు, కేంద్ర సంఘం నాయకులు గూడ ప్రభాకర్ రెడ్డి, నాగుల నరసింహస్వామి, సర్దార్ హర్మేందర్ సింగ్, సందీప్ రావు, కిరణ్ కుమార్ రెడ్డి, రమేష్ గౌడ్, మారుపాక రాజేష్ భరద్వాజ్, కోట రామస్వామి శంకర్ లు తదితరులు పాల్గొన్నారు.

About The Author