అంగన్ వాడి కేంద్రాల ఆకస్మిక తనిఖీ..
తనిఖీలో పాల్గొన్న సంక్షేమ శాఖ ఆర్.జె.డీ. ఝాన్సీ రాణి..
కామారెడ్డి :

ఈ సందర్భంగా శాఖలోని వివిధ శాఖలను సందర్శించి శాఖ పనితీరును అమలు చేయుచున్న పథకాలను పై సమీక్ష నిర్వహించారు.
కామారెడ్డి జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల ఆధ్వర్యంలో లోని ఐదు సిడిపిఓ ప్రాజెక్టుల అధికారులతో మాట్లాడి వారి యొక్క సమస్యను అడిగి తెలుసుకున్నారు వారికి తగు సూచనలు చేయడం జరిగింది.
కామారెడ్డి నందుగల డ్రైవర్స్ కాలనీ వన్ అంగన్వాడీ కేంద్రాన్ని, రాజీవ్ నగర్ అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించడం జరిగింది. తదుపరి సఖి కేంద్రం( వన్ స్టాప్ సెంటర్) ను సందర్శించి సఖి కేంద్ర నిర్వాణకై సిబ్బందితో సమీక్ష జరిపినారు. సిబ్బందికి తగు సూచనలు ఇవ్వడం జరిగింది, నూతనంగా నిర్మించుచున్న సఖి భవన నిర్మాణం పనితీరును పరిశీలించినారు. చివరగా ప్రభుత్వ బాలికల వసతి గృహమును సందర్శించినారు. చిల్డ్రన్ హోమ్ లోని బాలికలతో వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బాలికలకు భోజన వసతి ఆరోగ్య సదుపాయాల పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూపరిండెంట్ ఆదేశించినారు.
ఈ సందర్భంగా ఆర్జెడి ఝాన్సీ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పనితీరు సంతృప్తిగా ఉందని తెలపడం జరిగింది.
About The Author
15 Nov 2025
