ఒక మనిషికి ఎంతో గొప్ప మనసు,మానవీయ కోణం ఉంటేనే అవయవదానం
లయన్ డాక్టర్ ఎస్ రామచంద్రరావు,
- అన్ని దానాల్లోకెల్లా అవయవదానమే మిన్న.!
- అవయవ దానంతో మనం మరణించినా కూడా మరో 8 మందికి ప్రాణం పోయవచ్చు!
ఎల్బీనగర్, ఆగష్టు 14 (భారత శక్తి): మానవతావాది,సమాజ సేవే తన మతంగా భావించి తన మాతృమూర్తి సంతపూర్ సుజాతమ్మ పేరుతో ఎస్ఆర్ఆర్ ట్రస్టు స్థాపించి,ఎన్నో సామాజిక సేవాకార్యక్రమాలతో పాటు, తన మరణానంతరం అవయవాలను దానం చేయడానికి కూడా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు లయన్ డా.ఎస్. రామచంద్ర రావు.సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, అఖిల భారత శరీర అవయవ దాతలు సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ గూడూరు సీతామాలక్ష్మి స్ఫూర్తితో, సమాజ సేవలో భాగంగా అవయవ దాన ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా కీలకపాత్ర పోషిస్తానని,మతపరంగా ఎన్నో సంప్రదాయాలు,కట్టుబాట్లు ఉన్నప్పటికీ కూడా మనం మరణించిన తర్వాత మన దేహాన్ని మట్టిలో పూడ్చడం లేదా,కాల్చి బూడిద చేయడం అనేది నిరర్థకం. గూడూరు సీతా మహాలక్ష్మి గారి *మరణించినా జీవించండి* అనే నినాదం కోసం తన జీవిత కాలమంతా కూడా పనిచేస్తానని,తన కుటుంబ సభ్యులందరి సమ్మతంతోనే అవయవదానానికి పూనుకున్నానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ నిర్ణయానికి తనను ఎంతగానో ప్రభావితం చేసిన గూడూరు సీతామాలక్ష్మికి అఖిల భారత శరీర అవయవదాతల సంఘం సభ్యులకి ధన్యవాదాలు తెలియజేశారు.