డంపింగ్ యార్డ్ సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం.
మున్సిపల్ కమిషనర్ సునీత
షాద్నగర్, భారత శక్తి ప్రతినిధి, ఆగస్టు 14: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని సోలిపూర్ గ్రామ ప్రజలకు త్వరలో ఒక శుభవార్త అందనుందని, గ్రామ శివారులోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు సమీపంలో ఉన్న డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని కాంగ్రెస్ పార్టీ నేతలు అన్నారు. గురువారం మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ బాబర్ అలీ ఖాన్, పలువురు కాంగ్రెస్ నేతలు మున్సిపల్ కమిషనర్ సునీతతో కలిసి డంపింగ్ యార్డ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎమ్మెల్యే సంపూర్ణ సహకారంతో ఈ సమస్యను పరిష్కరించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారని వారు పేర్కొన్నారు. ఈ డంపింగ్ యార్డ్ కారణంగా గ్రామంలో పర్యావరణ సమస్యలు, దుర్వాసన వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు చాలా కాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, ముఖ్యంగా సమీపంలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో నివసించాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొందని, ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ చొరవ తీసుకుని ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని వారు తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ తో నాయకులు ఈ సమస్య పరిష్కారం కోసం అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మార్గదర్శనంలో త్వరలోనే డంపింగ్ యార్డ్‌ను తరలించి, సోలిపూర్ గ్రామ ప్రజలకు ఊరట కల్పిస్తామని కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న పరిస్థితులపై వారు ఆరా తీశారు. ఈ పరిశీలనలో సీనియర్ నాయకులు రఘు నాయక్, అగ్గనూర్ బస్వం, చెంది తిరుపతి రెడ్డి, మహమ్మద్ ఇబ్రహీం, సర్వర్ పాషా, గోపాల్ నాయక్, అనిల్, జంగారి రవి, ఇస్తాక్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే చొరవ పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
About The Author
16 Aug 2025