ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సిటిజన్ చార్ట్ ను కచ్చితంగా ప్రదర్శించాలి.
రాష్ట్ర చీప్ ఇన్ఫర్మేషన్ కమిషనర్
కామారెడ్డి : మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం 2025 పై రాష్ట్ర సమాచార కమిషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాలలోని సమావేశ మందిరంలో పిఐఓ అధికారులకు అవగాహన సదస్సు జరిగింది.
అనంతరం కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహించిన ఆర్టిఐ చట్టం అవగాహన సదస్సులో రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సిటిజన్ చార్ట్ ను కచ్చితంగా ప్రదర్శించాలని రాష్ట్ర చీప్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి అధికారులకు సూచించారు. ఆర్టిఐ దరఖాస్తులు, ఫిర్యాదులు తక్కువ అందిన 3 జిల్లాలలో కామారెడ్డి జిల్లా ఒకటని అందుకు అధికారులను అభినందించారు. ఇదే సమయంలో కామారెడ్డి కొత్త జిల్లా కాబట్టి ఆర్టిఐ చట్టంపైన ప్రజలకు మరింత అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని సూచించారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న పాత కేసులను ఈరోజు ప్రత్యేక విచారణ ద్వారా పరిష్కరిస్తామని తెలిపారు. ప్రభుత్వ విధులలో పారదర్శకత జవాబుదారీతనం పెంపొందించేందుకు ఆర్టిఐ 2025 చట్టాన్ని ప్రభుత్వం తీసుకు వచ్చిందని తెలిపారు. చట్టం ఉద్దేశం ప్రకారం దరఖాస్తుదారు అడిగిన విధంగా నిర్ణీత 30 రోజుల సమయంలో పారదర్శకంగా ఖచ్చితమైన సమాచారాన్ని యధాతధంగా అందించాలని సూచించారు. సమాచారం ఇవ్వడానికి తిరస్కరిస్తే సరియైన కారణాన్ని చూపాలని తెలిపారు. ఆర్టిఐ చట్టం గురించి ఎలాంటి భయం లేకుండా ప్రజలు ఏది అడిగితే అది అందించాలని, ఆర్టిఐ చట్టం అమలులో నిర్లక్ష్యం వహించే అధికారులకు చట్టం ననుసరించి చర్యలు తీసుకొని గరిష్టంగా 25 వేల రూపాయల వరకు ఫైన్ వేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సిటిజన్ చార్ట్ ను ప్రదర్శించి వాటిలో ఆ కార్యాలయం ద్వారా అందించే సేవలు, అధికారులు, సిబ్బంది, వివరాలు, ఈ సేవలను ఎన్ని రోజులలో అందిస్తారు తదితర వివరాలను ప్రదర్శించాలని అన్నారు. ప్రపంచంలోనే ఏ మూలలో ఉన్న వారైనా కూడా సమాచారాన్ని సులభంగా తెలుసుకునేందుకు, ప్రపంచంలో అందరికీ అందుబాటులో ఉండేలా ఆయా శాఖల వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలని సూచించారు. సమాచార హక్కు చట్టం ప్రకారం ఎలాంటి కారణం లేకుండా ఏ ఆఫీస్ నుంచైనా ఏ రూపంలోనైనా సమాచారాన్ని కోరేహక్కు ప్రజలకు ఉందన్నారు. అన్ని కార్యాలయాల్లో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారిని, ఏపీఐఓ ను నియమించాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, ఆర్టిఐ చట్టంపై ప్రతి ఒక్క అధికారి పూర్తి అవగాహన పెంపొందించుకొని ఆర్టిఐ మార్గదర్శకాల ప్రకారం అధికారులు స్పందించి పారదర్శకంగా సమాచారాన్ని అందించాలని అన్నారు. నిన్నటి వరకు జిల్లాలో పెండింగ్ లో గల 220 కి పైగా ఆర్.టి.ఐ ఆప్పీల్ కేసులను కలెక్టరేట్ లో రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషన్ ప్రత్యేకంగా హియరింగ్ నిర్వహించి పరిష్కరించనున్నారని తెలిపారు.
ఇన్ఫర్మేషన్ కమిషన్ కమిషనర్ మోహ్సి నా పర్వీన్ మాట్లాడుతూ, నాలుగు నెలల క్రితం నూతన స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఏర్పాటు తర్వాత పెండింగ్లో ఉన్న 18 వేల కేసులలో 2300 పైగా కేసులను పరిష్కరించడం జరిగిందని తెలిపారు. పిఐఓ అధికారులు ఆర్టిఐ చట్టం అమలుపై లేవనెత్తిన సందేశాలకు సమాధానాలు ఇచ్చారు.
రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషన్ కమిషనర్ దేశల భూపాల్ మాట్లాడుతూ, ఆర్టిఐ చట్టం అమలై 20 సంవత్సరాలు పూర్తయిన ఈ సందర్భంగా ఈ సంవత్సరాలలో వచ్చిన కేసులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి దరఖాస్తు దారు తృప్తి పొందేలా నిర్ణీత సమయంలో సమాచారాన్ని అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, అడిషనల్ కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్, బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా అడిషనల్ ఎస్పీ చైతన్యరెడ్డి, పిఐఓ లు, ఏపీఐఓ తదితరులు పాల్గొన్నారు.