అక్రమంగా ఇసుక తరలిస్తున్న వ్యక్తి రిమాండ్.
వేములవాడ : అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెడ్డవేని పరుశురాంపై కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలిస్తున్నట్లుగా వేములవాడ పట్టణ ఎస్సై రామ్మోహన్ తెలిపారు. కేసు పూర్వపరాలు పోలీసుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి.సోమవారం రాత్రి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని పక్కా సమాచారంతో పోలీసులు మూల వాగు చేరుకున్నారు.అక్కడ ట్రాక్టర్ ద్వారా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న పరుశురాముల అనే వ్యక్తిని పిలిచి ఇసుక రవాణాకు సంబంధించిన అనుమతి పత్రాలు చూపించాలని అడగగా,నా ఇష్టం మీకేంది చూపించిందని అంటూ దురుసుగా బదిలీస్తూ పోలీసులపై దాడికి యత్నించాడు.దీంతో పోలీసులు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న పరశురాములను, ట్రాక్టర్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. మంగళవారం ట్రాక్టర్ ను సీజ్ చేసి, పరశురాములను కోర్టులో హాజరు పరచగా, కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించినట్లుగా రామ్మోహన్ తెలిపారు.