ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలి..

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలి..

కరీంనగర్ ప్రతినిధి,ఆగస్టు 12 (భారత శక్తి):ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని,  భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసేలా చూడాలని, కొత్తపల్లి బిజెపి మండలాధ్యక్షుడు కుంట తిరుపతి పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ  సూచన మేరకు కొత్తపల్లి రూరల్ మండల శాఖ ఆధ్వర్యంలో, మంగళవారం రోజున హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ, ఖాజీపూర్ చౌరస్తా నుండి బావుపేట గ్రామంలోని అంగడి బజార్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా కుంట తిరుపతి మాట్లాడుతూ.. ప్రజలతో కలిసి తిరంగా యాత్ర కార్యక్రమాలు నిర్వహించి, దేశ సమైక్యత, సమగ్రత కోసం ప్రతిజ్ఞ చేయాలని సూచించారు. ముఖ్యంగా  ఆపరేషన్ సింధూర్ దేశానికి గర్వకారణంగా నిలిచిందన్నారు.

యావత్ ప్రపంచమే భారత్ ధైర్య సాహసాలు , శక్తి సామర్ధ్యాలను చూసి నివ్వరపోయిందన్నారు. సింధూర్ తో దేశ ఖ్యాతి  విశ్వంలో మార్మోగిపోతుందన్నారు. అందుకే పంద్రాగస్టు వేడుకలను మరింత ఘనంగా నిర్వహించేలా, పార్టీ నాయకత్వం కార్యక్రమాలను రూపొందించింది అన్నారు. అందులో భాగంగా ఆగస్టు 10 నుండి 15 వరకు నిర్వహించే కార్యక్రమంలో, మన త్రివిధ దళాలను ప్రశంసిస్తూ, వీరుల త్యాగాలను గుర్తించాలని సూచించారు. 13 నుండి 15వ తేదీ వరకు పార్టీ కార్యకర్తలు అందరి ఇంటిపై, కార్యాలయాల భవనాలపై, త్రివర్ణ పతాకం ఎగరవేయాలని, సాధ్యమైనంతవరకు పిల్లల చేత జెండాలు ఎగర వేయించాలన్నారు. ఈరోజు నుండి 14 వరకు స్వాతంత్ర పోరాటకు స్మారక చిహ్నాలు, స్వాతంత్ర ఉద్యమంలో ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలు, యుద్ధ స్మారక చీనాల చుట్టూ పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని, అన్ని ప్రాంతాలలో స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టి, మహనీయులకు పూలమాలలు వేసి నివాళులు అర్పించాలని అన్నారు. ప్రోగ్రాంలో భాగంగా మండల సమస్యలపై కుంట తిరుపతి మాట్లాడారు. అలాగే  కొత్తపల్లి మండల  ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ఒకే చోట ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు కడార్ల రతన్, రమేష్, కుమార్, కోమటిరెడ్డి అంజన్ కుమార్, వేముల అనిల్ కుమార్, సోమినేని కర్ణాకర్, గుడిసెల రంజిత్, కుమార్, పోర్తి అనిల్, బోనాల నరేష్, కడారి శ్రీనివాస్, ఇల్లందు ఆనంద్, బైరెడ్డి వంశీ, మెరుగు మల్లేశం, బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు. 

Read More తమ తప్పులను తెలుసుకోలేక ఎన్నికల కమిషన్ పై ఆరోపణలు చేస్తున్న ఇండియా కూటమి

About The Author