Friendly police..? Peekkudiné police..?

ఫ్రెండ్లీ పోలీసా..? పీక్కుదినే పోలీసా..?

- ఏ కొందరో నిజాయితీగా ఉంటే సరిపోదు..  - వ్యవస్థ మొత్తానికి అపవాదు అంటుకుంటుంది..  - పోలీసంటే ధైర్యం కలగాలి.. భయం కాదు.. - ఒక్క చుక్క నిమ్మరసం కుండెడు పాలను విరగ్గొడుతుంది..  - ఫ్రెండ్లీ పోలీస్ అంటూ ఊదరగొట్టడం తప్ప ఒరిగింది ఏమీలేదు..  - కొందరు పోలీసులు రాజకీయ నాయకుల తొత్తులుగా మారిపోయారు..  - సమాజానికి రక్షణ బాధ్యతలు నిర్వహించాల్సిన వారు..   - మంత్రులు, కొందరు ఎమ్మెల్యే ఇండ్లల్లో పనివాళ్లుగా పనిచేస్తున్నారు..  - పైగా డిపార్ట్మెంట్ లో పేరుకుపోయిన అంతులేని అవినీతి.. - ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ పరిశోధనలో  వెల్లడైన భయంకర వాస్తవాలు. ఈ సమాజానికి రక్షణ కవచంగా ఉండేలా పోలీసు వ్యవస్థను రూపొందించారు.. కఠినమైన శిక్షణతో వారు రాటుదేలిపోతారు.. సొసయిటీలో పేరుకుపోయిన నేర ప్రవృత్తిని తుత్తునియలు చేసే విధంగా వారు తయారు చేయబడ్డారు.. ఖాకీ దుస్తులు ధరించి ధైర్యంగా, నిబద్ధతగా పనిచేయాల్సిన పోలీసులు వారి రూటు మార్చుకుని సమాజానికి కంటకంగా మారిపోవడం ఆందోళన కలిగించే విషయం.. కాగా పోలీసు వ్యవస్థ ప్రజలకు అనుకూలంగా పనిచేయాల్సి ఉంటుంది.. కానీ అధికారానికి గులాము చేస్తోంది.. రాజకీయ నాయకుల అడుగులకు మడుగులు వత్తుతోంది.. ఏదైనా సమస్యతో తమ వద్దకు వచ్చే వారికి ధైర్యం చెప్పాల్సింది పోయి, వారిపై దౌర్జన్యకాండకు దిగుతున్నారు పోలీసులు.. వారిని బెదిరిస్తున్నారు.. పోలీస్ స్టేషన్ కు వెళ్లాలంటేనే భయపడే దుర్భర పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి.. ఇది వాంఛనీయం కాదు.. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఎలా ఉండాలి..? అన్నది గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. ఈ కథనం పోలీసులందరికీ వర్తించదు.. గ్రహించగలరు.. 
తెలంగాణ  వెబ్ స్టోరీస్ 
Read More...