కమ్యూనిస్టు విప్లవ కారుల నాయకులు కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి గారికి విప్లవ జోహార్లు.

కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి( టి.యన్ ) గారు 11 ఫిబ్రవరి1917 సం: లో ఒక ఫ్యూడల్ భూస్వామ్య వర్గ కుటుంభంలో జన్మించారు. అనంతపూర్ తరిమేల ఆయన స్వగ్రామం 1976 జులై 28 న ఆయన రహస్య జీవితం లో వుంటూ అమరు లైనారు.అప్పటికీ …. ఆయన వయసు 59 సం:రాలు మాత్రమే… కామ్రేడ్ టి.యన్ ఫ్యూడల్ భూస్వామ్య వర్గ మైనప్పటికీ,ఆ వర్గ పతనానికి నిరంతరం పోరాడిన గొప్ప త్యాగశీలి.ఆయన త్యాగశీలి మాత్రమే కాదు,నిరంతర అధ్యయనశీలి కుడా.రాజకీయాల్లో స్పష్టత,నిజాయితీ, దూర దృష్టి,సమకాలీనత ఆయనకు సహ జంగా అబ్బిన గుణాలు.ఆయన ప్రాథమిక విద్య సంపన్నులు మాత్రమే చదివే ఋషి వ్యాలి స్కూల్.ఆ స్కూల్లోని విద్యార్థులకు విద్యాబోధనతో పాటు రుజువర్తన,సత్యసం దత వంటి అంశాలను ప్రాథమిక స్థాయిలో నే బోధిస్తూ వుంటారు. విప్లవోద్యమంలో కామ్రేడ్ నాగిరెడ్డి గారిది అ కాల మరణమే! అయినా…అకాల మరణం చెంది చరిత్రలో ప్రసిద్ధి గాంచిన వారు ఎందరో ఉన్నారు. లెనిన్ తన కాలంలో చరిత్రాత్మక భౌతిక,శాస్త్రీయ సామాజిక చలన సిద్ధాంత మైన మార్క్సిజాన్ని రష్యా దేశపు నిర్దిష్ట పరిస్థి తులకు అన్వహించి ప్రపంచంలోనే మొదటి సోషలిస్టు రాజ్య స్థాపనచేసినారు.ఆ మహా నాయకుడు 54 ఏండ్లు మాత్రమే జీవించి అమరుడైనాడు.ఆయన ప్రపంచ శ్రామిక వర్గానికి ఒక గొప్ప యుగ పురుషుడుగా వెలు గొందుతూనే ఉన్నారు.భారత దేశంలో బగత్ సింగ్ 24 ఏండ్లకే బ్రిటిష్ వలస వాదానికి వ్యతిరేకంగా పోరాడి ఉరికంభం ఎక్కి,భారత ప్రజల హృదయాల్లో చిరంజీవిగా నిలిచినారు. మన తెలుగు నేలలో బ్రిటీష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చిన్న వయస్సులోనే అమరులైనారు.వీరందరి సరస న కామ్రేడ్ టి.యన్ నిలిచినారు. కామ్రేడ్ మావో చెప్పినట్లు ….. ” ప్రజల కోసం జీవించి,వారి కోసమే మరణిం చడం హిమాలయా పర్వతాల కంటే ఎత్తైనది ” కామ్రేడ్ నాగిరెడ్డి గారి తన మొత్తం జీవితం కూడా తన విద్యార్థి దశ నుండి జాతీయోద్య మంతో స్ఫూర్తి పొంది,ఆ తరువాత శ్రామిక వర్గ సిద్ధాంతమైన మార్క్సిజానికి అంకితమై, కమ్యూనిస్టు పార్టీలో చేరినారు. ఈ దేశంలో కొనసాగుతూ ఉన్న ఫ్యూడల్ భూస్వామ్య, దళారి బడా భూర్జువా,సామ్రాజ్యవాద అను కూల దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా,జనతా ప్రజాతంత్ర విప్లవ కర్తవ్యాలను చేపట్టి,వాటి ని పరిపూర్తి చేయుటకు తన జీవిత చివరి క్షణం వరకు పోరాడిన నాయకుడాయన కామ్రేడ్ టి.యన్ ఆనాటి బ్రిటీష్ వలస పాలన లో తన కాలేజీ విద్యార్థి దశ నుండి స్పష్టమైన జాతీయ భావాలు కలిగిన విద్యార్థిగా ఉండే వారు.తన కాలేజీ విద్య బెనారస్ హిందూ యూనివర్సిటీలో కొనసాగుతున్న ఆరోజుల్లో నే విద్యార్థి సంఘ నాయకునిగా ( అధ్యక్ష ) ఎన్నికైనారు.లా పూర్తి చేస్తున్న సమయంలో విప్లవ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు బ్రిటీ ష్ ప్రబుత్వం అరెస్టు చేసి జైల్లో నిర్బంధిం- చింది.ఆయన తన రాజకీయ కార్యకలా పాలు ప్రాంభించినప్పటి నుండి కమ్యూనిస్టు పార్టీతో సంభందం కలిగి ఉన్నారు కామ్రేడ్,టి.యన్.1952 – 55, 1955 – 62, 1962 – 67, 1967 – 68 శాసన సభ సభ్య త్వానికి రాజీనామా చేసి,విప్లవ కార్యచర ణకు దిగేదాకా,ఆనాటి మద్రాస్ శాసన సభ లో ( మద్రాసులో ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉన్న ప్పుడు ) ప్రతిపక్ష నాయకుడుగా,పార్లమెంట్ సభ్యుడిగానూ, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలో,శాసనసభ ఉపనేతగాను ఉన్నారు. ఆయన 1962లో తన భావగారైన నీలం సంజీవరెడ్డి గారి మీద జైలునుండే విజయం సాధించిన గొప్ప ప్రజాదరణ కలిగిన కమ్యూ నిస్టు పార్టీ నేత.1969 మార్చి16 దాకా కొన సాగిన తన సుదీర్గ అసెంబ్లీ, పార్లమెంటరీ జీవితంలో వచ్చిన అనుభవాలతో ” పార్ల మెంట్లు, అసెంబ్లీలు బాతాఖాని షాపు ” ల ని పార్లమెంటరీ పంథాను తిరస్కరిస్తూ తన అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేసినా రు.కామ్రేడ్ నాగిరెడ్డి గారు సుమారు నాలు గు దశాబ్దాల పాటు సాగిన ఆయన రాజకీ య జీవితమే ఒక గొప్ప పోరాటం.ఈ పోరా టంలో ఆయన గడించిన అనుభవాలు అమూల్యమైనవి.అనుభవ సుసంపన్న …. మైనవి.వాటి నుండి నేటి తరం విప్లవ కారు లు స్ఫూర్తి పొందాల్సినవి అనేకం ఉన్నాయి. కామ్రేడ్ నాగిరెడ్డి గారు చక్కని వాగ్దాటి గల… నేత.శాసనసభ,పార్లమెంట్ లో,బహిరంగ సభల్లో ఆయన చేసిన ప్రసంగాలు విషయ సంపదతో నిండివుండేవి.తను ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో తనకు బాగా తెలుసు.మన దేశపు వక్తలలో ఆయనది అరుదైన లక్షణం. ఇక్కడ ఒక ఉదాహరణ పేర్కొనడం అసంద ర్భం కాదని భావిస్తున్నాను.మద్రాసు నుండి ఆంధ్రప్రదేశ్ గా విడిపోవాలనే ఉద్యమం జరుగుతున్న సందర్భం.మద్రాసులో ఆంధ్రుల సమస్యల పై ఒక బహిరంగ సభ జరిపి నారు. కా,టి.యన్. ఏకధాటిగా మూడు గంటలు మాట్లాడి నారు. శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మ పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేకి.కమ్యూనిస్టుల మీద ఆయన అభిప్రాయం ఏమంటే ! కమ్యూనిస్టులు హింసావాదులని,చంపడం తప్ప వారికిమరేమి తెలియదని, చదువు సంధ్య లేనివారనే మూర్కపు అభిప్రాయం కలిగి ఉండేవారు.నాగిరెడ్డి గారి ఉపాన్యాసం విన్న తరువాత తన అపోహలు పటాపంచ లైనావని,ఇంతటి భాష,ఇంతటి ఆమోఘమై న ఉపన్యాసం తాను ఇంతవరకు వినలేదని, సువర్ణాక్షరాలతో శాస్వితంగా లిఖించ వలిసిన ఉపన్యాసమని కా,టి.యన్ బసచేసిన రూమ్ కు వెళ్లి మరి కొనియాడినారు. కా,టి.యన్ ఉపన్యాసాలు సునీత పరిశీలన, ఆ పరిమిత పరిశోధన,నిర్విచిత పరిజ్ఞానం, నిర్దిష్ట అవగాహన కలిగి ఉండేవి.అందుకే కా,టి.యన్ గారు తన ప్రసంగాల ద్వారా వచ్చే విలువైన మాటలు ఆయుధాలుగా మలచి ప్రజల్లో నింపగలిగే వారు.ఇక్కడ ఒక సంధర్భాన్ని గుర్తు చేసుకోవాలి. శ్రీకాకుళ గిరిజన పోరాటంలో అమరులైన విప్లవ రచహిత సుబ్బారావు పాణిగ్రహి విప్లవ గీతాలు,కా,నాగిరెడ్డి గారు పాల్గొన్న బహి రంగ సభ(ఖమ్మం) ప్రజల్లో మరచి పోలేని ముద్ర వేసింది.ఈ నాటికీ విప్లవ సానుభూ తి పరులు కొనియాడుతూ వుంటారు. కామ్రేడ్ నాగిరెడ్డి గారు శాస్త్రీయ సిద్ధాంతమై న మార్క్సిజాన్ని అధ్యయనంచేసి ఆచరించి న కమ్యూనిస్టు నాయకులలో ముఖ్యులు. అయన జీవిత కాలం 59 సం:రాలే అయినా, ఈ కాలంలో ఒక నిజమైన మార్క్సిస్టు -లెనిని స్టు గా ఆయన కమ్యూనిస్టు విప్లవోద్యమాని కి చేసిన కృషి అపారమైనది1969 లో కుట్ర కేసులో ఇరికించ బడి జైలు గోడలు మధ్య మార్క్సిస్టు – లెనినిస్టు దృక్పధంతో,భారత దేశంలో దళారిపాలన,సామ్రజ్యవాద,దోపిడీ అర్థవలస విధాలు ఏ రూపంలో కొనసాగు తున్నాయో మార్క్సిస్టు – లెనినిస్టు వర్గ దృక్పధంతో శాస్త్రీయ పరిశీలన చేసి ” తాకట్టులో భారత దేశం ” అనే ప్రామాణిక గ్రంథ రచన ఆయన విషయ పరిజ్ఞానానికి దర్పణంగా నిలుస్తుంది.భారత దేశంలోని వామపక్ష మేదావుల్లో విసృతంగా ప్రాచుర్యం పొందిన గ్రంధం. మన దేశంలో దోపిడీ పాలక వర్గాల నికృష్ట మైన విధానాలను,ప్రజలు అనుభవించే దారుణమైన బాధల గురించి వర్ణించి చెప్ప డమే మార్క్సిజమని భావించే మేధావులకు కొదవలేదు.మార్క్సిస్టు పార్టీలో ఈ తరహా మేధావులు ఎక్కువ కనపడతారు.మార్క్సి జం – లెనినిజానికి గుత్తాదిపత్యం మాదే అన్నట్లగా మాట్లాడుతారు.కొందరి దృష్టిలో దోపిడీని అర్థం చేసుకొనడం,దాన్ని గురించి చెప్పడం మాత్రమే మార్క్సిజంగా భావిస్తా రు.మరి కొందరు శాస్త్రీయ,సామాజిక,ఆచర ణాత్మక సిద్ధాంతంగా కాకుండా అకడమిక్ అవగాహనతో మార్క్సిజాన్ని అధ్యయనం చెసి,ఆ అవగాహనతో మాత్రమే విశ్లేషణలు చేసి మార్క్సిస్టులమని బ్రమ పడతారు. దేశంలో వర్గ పోరాటాలను నిర్మించి,శ్రామికవర్గ నాయకత్వాన ముందు జనతా ప్రజాతంత్ర విప్లవా కర్తవ్యాలను పూర్తిచేసి,ఆ తరువాత శ్రామికవర్గ నియంతృత్వాన్ని స్థాపించి సోషలి జాన్ని నిర్మించాలనే లక్ష్యాలను,ఆచరణను, వారు కలిగి ఉన్నట్లుగా భావించలేము.మన దేశంలో ఫ్యూడల్ వ్యతిరేక భూర్జువా ప్రజా తంత్ర విప్లవం పరిపూర్తి కాలేదనే మౌళికాం- శాన్ని వారు గుర్తించరు.ఆ విధంగా గుర్తించి జనతా ప్రజాతంత్ర విప్లవోద్యమ కర్తవ్యాల ను స్వీకరించి నపుడే వారు నిజమైన ….. మార్క్సిస్టు – లెనినిస్టులు ఆవుతారు. ఇటీవల మార్క్సిస్టు మేధావులనబడే వారు, వర్గ దృష్టి లేని,ప్రతి అంశాన్ని కులదృక్పదం తో ముడిపెట్టి చూసే మేధావులు దేశంలో నేడు కొనసాగుతున్న అర్ధ భూస్వామ్య వ్యవ స్థను ” భ్రాంతి జనిత అర్ధ భూస్వామ్యమని ” అభి వర్ణిస్తూన్నారు.వాస్తవం ఏమంటే ! మన దేశంలో అర్ధభూస్వామ్యం కొనసాగుతూ ఉందనేది ఒక భౌతిక వాస్తవం.భ్రాంతి జనితం ఎంత మాత్రం కాదు.ఇందుకు సంభందించిన అనేక ఉదాహరణలున్నాయి. ఇక్కడ ఒక అంశం పేర్కొనాలి.చారిత్రక సామాజిక,భౌతిక వాస్తవాలను మార్క్సిస్టు వర్గ దృక్పదం ఉన్న వారు మాత్రమే చూడగలరు.సరైన అంచనా వేయగలరు. అంబేత్కరిస్టులు,అకడమిక్ స్టులకు ఎంత మాత్రం సాధ్యం కాదు.ఎందువల్లనంటే వారు ” కార్యవాద సిద్ధాంతం “తో ప్రభావితమై ఉం టారు. కార్యవాద సిద్ధాంతం ఎప్పుడు భావ వాదాన్ని ప్రబోధిస్తుంది.భావవాదం ఎప్పుడు భౌతిక వాస్తవాలను చూడలేదు.మార్క్సిస్టు వర్గ దృక్పధం కార్యసాధన సిద్ధాంతం.ఆది ఎల్లపుడు భౌతిక వాస్తవాలనే చూస్తుంది. నమ్ముతుంది.మన దేశంలో భావ వాదమైన అంబేత్కరిజానికి – కార్య సాధన భౌతిక సిద్ధాంతమైన మార్క్సిజానికి ఈ వైరుధ్యం కొనసాగుతూనే వుంటుంది. కారల్ మార్క్స్,ఎంగెల్స్ కమ్యూనిస్టు ప్రణాళి కను ప్రవేశపెడుతూ ( 1848 )అభివృద్ధి చెంది న యూరప్ పెట్టుబడి దారి దోపిడీ సమాజాల గురించి చేసిన విశ్లేషణలు,సూత్రీకరణలు అర్ధ వలస,ఫ్యూడల్ భూస్వామ్య వ్యవస్థగల ఈ నాటి మనదేశ సమాజానికి వర్తిస్తాయని కొందరు మార్క్సిస్టు – లెనిస్టులు సూత్రీకరిస్తూ న్నారు.వారు సాంప్రదాయ మార్క్సిస్టు దృక్ప దంతోనే బ్రిటీష్ వలస వాదుల రాకతోనే భారత దేశంలో ఫ్యూడలిజం పతనం ప్రారం భమైనదని అంచనాకు వచ్చినారు.1947 బ్రిటీష్ వలస పాలన నుండి జాతీయ శక్తులు అధికారం చేపట్టిన తరువాత దేశం పెట్టుబడి దారి దేశంగా అభివృద్ది చెందినదనేది వారి సూత్రీకరణల సారాంశం.ఈ కారణంగానే వారు దేశంలో పెట్టుబడిదారి వ్యతిరేక సోష లిస్టు విప్లవానికి పిలుపుణిస్తున్నారు. ఇది ఈనాటి భౌతిక పరిస్తితులకు సంబంధం లేని అంచనా.దేశంలో 1946 నుండే ఫ్యూడల్ భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా తెలంగా ణా సాయుధ పోరాటం అభివృద్ధి చెంది నడి చింది.1967 నుండి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లో నక్సల్ బరి,ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళ గిరిజన విప్లవోద్యమాలు ఉన్నత

కమ్యూనిస్టు విప్లవ కారుల నాయకులు కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి గారికి విప్లవ జోహార్లు.

కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి( టి.యన్ ) గారు
11 ఫిబ్రవరి1917 సం: లో ఒక ఫ్యూడల్
భూస్వామ్య వర్గ కుటుంభంలో జన్మించారు.
అనంతపూర్ తరిమేల ఆయన స్వగ్రామం
1976 జులై 28 న ఆయన రహస్య జీవితం
లో వుంటూ అమరు లైనారు.అప్పటికీ ….
ఆయన వయసు 59 సం:రాలు మాత్రమే…
కామ్రేడ్ టి.యన్ ఫ్యూడల్ భూస్వామ్య వర్గ
మైనప్పటికీ,ఆ వర్గ పతనానికి నిరంతరం
పోరాడిన గొప్ప త్యాగశీలి.ఆయన త్యాగశీలి
మాత్రమే కాదు,నిరంతర అధ్యయనశీలి
కుడా.రాజకీయాల్లో స్పష్టత,నిజాయితీ,
దూర దృష్టి,సమకాలీనత ఆయనకు సహ
జంగా అబ్బిన గుణాలు.ఆయన ప్రాథమిక
విద్య సంపన్నులు మాత్రమే చదివే ఋషి
వ్యాలి స్కూల్.ఆ స్కూల్లోని విద్యార్థులకు విద్యాబోధనతో పాటు రుజువర్తన,సత్యసం
దత వంటి అంశాలను ప్రాథమిక స్థాయిలో
నే బోధిస్తూ వుంటారు.

విప్లవోద్యమంలో కామ్రేడ్ నాగిరెడ్డి గారిది అ
కాల మరణమే! అయినా…అకాల మరణం
చెంది చరిత్రలో ప్రసిద్ధి గాంచిన వారు ఎందరో ఉన్నారు. లెనిన్ తన కాలంలో చరిత్రాత్మక భౌతిక,శాస్త్రీయ సామాజిక చలన సిద్ధాంత
మైన మార్క్సిజాన్ని రష్యా దేశపు నిర్దిష్ట పరిస్థి
తులకు అన్వహించి ప్రపంచంలోనే మొదటి
సోషలిస్టు రాజ్య స్థాపనచేసినారు.ఆ మహా నాయకుడు 54 ఏండ్లు మాత్రమే జీవించి
అమరుడైనాడు.ఆయన ప్రపంచ శ్రామిక
వర్గానికి ఒక గొప్ప యుగ పురుషుడుగా వెలు
గొందుతూనే ఉన్నారు.భారత దేశంలో బగత్ సింగ్ 24 ఏండ్లకే బ్రిటిష్ వలస వాదానికి వ్యతిరేకంగా పోరాడి ఉరికంభం ఎక్కి,భారత ప్రజల హృదయాల్లో చిరంజీవిగా నిలిచినారు.
మన తెలుగు నేలలో బ్రిటీష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చిన్న వయస్సులోనే అమరులైనారు.వీరందరి సరస
న కామ్రేడ్ టి.యన్ నిలిచినారు.

కామ్రేడ్ మావో చెప్పినట్లు …..

” ప్రజల కోసం జీవించి,వారి కోసమే మరణిం
చడం హిమాలయా పర్వతాల కంటే ఎత్తైనది ”

కామ్రేడ్ నాగిరెడ్డి గారి తన మొత్తం జీవితం కూడా తన విద్యార్థి దశ నుండి జాతీయోద్య
మంతో స్ఫూర్తి పొంది,ఆ తరువాత శ్రామిక
వర్గ సిద్ధాంతమైన మార్క్సిజానికి అంకితమై,
కమ్యూనిస్టు పార్టీలో చేరినారు. ఈ దేశంలో
కొనసాగుతూ ఉన్న ఫ్యూడల్ భూస్వామ్య,
దళారి బడా భూర్జువా,సామ్రాజ్యవాద అను
కూల దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా,జనతా
ప్రజాతంత్ర విప్లవ కర్తవ్యాలను చేపట్టి,వాటి
ని పరిపూర్తి చేయుటకు తన జీవిత చివరి
క్షణం వరకు పోరాడిన నాయకుడాయన

కామ్రేడ్ టి.యన్ ఆనాటి బ్రిటీష్ వలస పాలన
లో తన కాలేజీ విద్యార్థి దశ నుండి స్పష్టమైన
జాతీయ భావాలు కలిగిన విద్యార్థిగా ఉండే
వారు.తన కాలేజీ విద్య బెనారస్ హిందూ
యూనివర్సిటీలో కొనసాగుతున్న ఆరోజుల్లో
నే విద్యార్థి సంఘ నాయకునిగా ( అధ్యక్ష ) ఎన్నికైనారు.లా పూర్తి చేస్తున్న సమయంలో విప్లవ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు బ్రిటీ
ష్ ప్రబుత్వం అరెస్టు చేసి జైల్లో నిర్బంధిం-
చింది.ఆయన తన రాజకీయ కార్యకలా
పాలు ప్రాంభించినప్పటి నుండి కమ్యూనిస్టు పార్టీతో సంభందం కలిగి ఉన్నారు

కామ్రేడ్,టి.యన్.1952 – 55, 1955 – 62,
1962 – 67, 1967 – 68 శాసన సభ సభ్య
త్వానికి రాజీనామా చేసి,విప్లవ కార్యచర
ణకు దిగేదాకా,ఆనాటి మద్రాస్ శాసన సభ
లో ( మద్రాసులో ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉన్న
ప్పుడు ) ప్రతిపక్ష నాయకుడుగా,పార్లమెంట్ సభ్యుడిగానూ, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలో,శాసనసభ ఉపనేతగాను ఉన్నారు.
ఆయన 1962లో తన భావగారైన నీలం సంజీవరెడ్డి గారి మీద జైలునుండే విజయం
సాధించిన గొప్ప ప్రజాదరణ కలిగిన కమ్యూ
నిస్టు పార్టీ నేత.1969 మార్చి16 దాకా కొన
సాగిన తన సుదీర్గ అసెంబ్లీ, పార్లమెంటరీ
జీవితంలో వచ్చిన అనుభవాలతో ” పార్ల
మెంట్లు, అసెంబ్లీలు బాతాఖాని షాపు ” ల
ని పార్లమెంటరీ పంథాను తిరస్కరిస్తూ తన
అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేసినా
రు.కామ్రేడ్ నాగిరెడ్డి గారు సుమారు నాలు
గు దశాబ్దాల పాటు సాగిన ఆయన రాజకీ
య జీవితమే ఒక గొప్ప పోరాటం.ఈ పోరా
టంలో ఆయన గడించిన అనుభవాలు అమూల్యమైనవి.అనుభవ సుసంపన్న ….
మైనవి.వాటి నుండి నేటి తరం విప్లవ కారు
లు స్ఫూర్తి పొందాల్సినవి అనేకం ఉన్నాయి.

కామ్రేడ్ నాగిరెడ్డి గారు చక్కని వాగ్దాటి గల…
నేత.శాసనసభ,పార్లమెంట్ లో,బహిరంగ సభల్లో ఆయన చేసిన ప్రసంగాలు విషయ సంపదతో నిండివుండేవి.తను ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో తనకు బాగా తెలుసు.మన దేశపు వక్తలలో ఆయనది అరుదైన లక్షణం.

ఇక్కడ ఒక ఉదాహరణ పేర్కొనడం అసంద
ర్భం కాదని భావిస్తున్నాను.మద్రాసు నుండి ఆంధ్రప్రదేశ్ గా విడిపోవాలనే ఉద్యమం జరుగుతున్న సందర్భం.మద్రాసులో ఆంధ్రుల
సమస్యల పై ఒక బహిరంగ సభ జరిపి నారు.
కా,టి.యన్. ఏకధాటిగా మూడు గంటలు మాట్లాడి నారు. శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మ పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేకి.కమ్యూనిస్టుల
మీద ఆయన అభిప్రాయం ఏమంటే ! కమ్యూనిస్టులు హింసావాదులని,చంపడం
తప్ప వారికిమరేమి తెలియదని, చదువు
సంధ్య లేనివారనే మూర్కపు అభిప్రాయం
కలిగి ఉండేవారు.నాగిరెడ్డి గారి ఉపాన్యాసం
విన్న తరువాత తన అపోహలు పటాపంచ
లైనావని,ఇంతటి భాష,ఇంతటి ఆమోఘమై
న ఉపన్యాసం తాను ఇంతవరకు వినలేదని,
సువర్ణాక్షరాలతో శాస్వితంగా లిఖించ వలిసిన ఉపన్యాసమని కా,టి.యన్ బసచేసిన రూమ్
కు వెళ్లి మరి కొనియాడినారు.

కా,టి.యన్ ఉపన్యాసాలు సునీత పరిశీలన,
ఆ పరిమిత పరిశోధన,నిర్విచిత పరిజ్ఞానం,
నిర్దిష్ట అవగాహన కలిగి ఉండేవి.అందుకే కా,టి.యన్ గారు తన ప్రసంగాల ద్వారా
వచ్చే విలువైన మాటలు ఆయుధాలుగా
మలచి ప్రజల్లో నింపగలిగే వారు.ఇక్కడ ఒక
సంధర్భాన్ని గుర్తు చేసుకోవాలి. శ్రీకాకుళ
గిరిజన పోరాటంలో అమరులైన విప్లవ
రచహిత సుబ్బారావు పాణిగ్రహి విప్లవ
గీతాలు,కా,నాగిరెడ్డి గారు పాల్గొన్న బహి
రంగ సభ(ఖమ్మం) ప్రజల్లో మరచి పోలేని
ముద్ర వేసింది.ఈ నాటికీ విప్లవ సానుభూ
తి పరులు కొనియాడుతూ వుంటారు.

కామ్రేడ్ నాగిరెడ్డి గారు శాస్త్రీయ సిద్ధాంతమై
న మార్క్సిజాన్ని అధ్యయనంచేసి ఆచరించి
న కమ్యూనిస్టు నాయకులలో ముఖ్యులు.
అయన జీవిత కాలం 59 సం:రాలే అయినా,
ఈ కాలంలో ఒక నిజమైన మార్క్సిస్టు -లెనిని
స్టు గా ఆయన కమ్యూనిస్టు విప్లవోద్యమాని
కి చేసిన కృషి అపారమైనది1969 లో కుట్ర
కేసులో ఇరికించ బడి జైలు గోడలు మధ్య
మార్క్సిస్టు – లెనినిస్టు దృక్పధంతో,భారత
దేశంలో దళారిపాలన,సామ్రజ్యవాద,దోపిడీ
అర్థవలస విధాలు ఏ రూపంలో కొనసాగు
తున్నాయో మార్క్సిస్టు – లెనినిస్టు వర్గ
దృక్పధంతో శాస్త్రీయ పరిశీలన చేసి
” తాకట్టులో భారత దేశం ” అనే ప్రామాణిక
గ్రంథ రచన ఆయన విషయ పరిజ్ఞానానికి
దర్పణంగా నిలుస్తుంది.భారత దేశంలోని
వామపక్ష మేదావుల్లో విసృతంగా ప్రాచుర్యం
పొందిన గ్రంధం.

మన దేశంలో దోపిడీ పాలక వర్గాల నికృష్ట
మైన విధానాలను,ప్రజలు అనుభవించే దారుణమైన బాధల గురించి వర్ణించి చెప్ప
డమే మార్క్సిజమని భావించే మేధావులకు కొదవలేదు.మార్క్సిస్టు పార్టీలో ఈ తరహా మేధావులు ఎక్కువ కనపడతారు.మార్క్సి
జం – లెనినిజానికి గుత్తాదిపత్యం మాదే అన్నట్లగా మాట్లాడుతారు.కొందరి దృష్టిలో దోపిడీని అర్థం చేసుకొనడం,దాన్ని గురించి చెప్పడం మాత్రమే మార్క్సిజంగా భావిస్తా
రు.మరి కొందరు శాస్త్రీయ,సామాజిక,ఆచర
ణాత్మక సిద్ధాంతంగా కాకుండా అకడమిక్ అవగాహనతో మార్క్సిజాన్ని అధ్యయనం చెసి,ఆ అవగాహనతో మాత్రమే విశ్లేషణలు
చేసి మార్క్సిస్టులమని బ్రమ పడతారు.

దేశంలో వర్గ పోరాటాలను నిర్మించి,శ్రామికవర్గ
నాయకత్వాన ముందు జనతా ప్రజాతంత్ర
విప్లవా కర్తవ్యాలను పూర్తిచేసి,ఆ తరువాత శ్రామికవర్గ నియంతృత్వాన్ని స్థాపించి సోషలి
జాన్ని నిర్మించాలనే లక్ష్యాలను,ఆచరణను,
వారు కలిగి ఉన్నట్లుగా భావించలేము.మన
దేశంలో ఫ్యూడల్ వ్యతిరేక భూర్జువా ప్రజా
తంత్ర విప్లవం పరిపూర్తి కాలేదనే మౌళికాం-
శాన్ని వారు గుర్తించరు.ఆ విధంగా గుర్తించి జనతా ప్రజాతంత్ర విప్లవోద్యమ కర్తవ్యాల
ను స్వీకరించి నపుడే వారు నిజమైన …..
మార్క్సిస్టు – లెనినిస్టులు ఆవుతారు.

ఇటీవల మార్క్సిస్టు మేధావులనబడే వారు,
వర్గ దృష్టి లేని,ప్రతి అంశాన్ని కులదృక్పదం
తో ముడిపెట్టి చూసే మేధావులు దేశంలో
నేడు కొనసాగుతున్న అర్ధ భూస్వామ్య వ్యవ
స్థను ” భ్రాంతి జనిత అర్ధ భూస్వామ్యమని ”
అభి వర్ణిస్తూన్నారు.వాస్తవం ఏమంటే ! మన
దేశంలో అర్ధభూస్వామ్యం కొనసాగుతూ
ఉందనేది ఒక భౌతిక వాస్తవం.భ్రాంతి జనితం
ఎంత మాత్రం కాదు.ఇందుకు సంభందించిన
అనేక ఉదాహరణలున్నాయి. ఇక్కడ ఒక అంశం పేర్కొనాలి.చారిత్రక సామాజిక,భౌతిక
వాస్తవాలను మార్క్సిస్టు వర్గ దృక్పదం ఉన్న
వారు మాత్రమే చూడగలరు.సరైన అంచనా వేయగలరు.

అంబేత్కరిస్టులు,అకడమిక్ స్టులకు ఎంత
మాత్రం సాధ్యం కాదు.ఎందువల్లనంటే వారు
” కార్యవాద సిద్ధాంతం “తో ప్రభావితమై ఉం
టారు. కార్యవాద సిద్ధాంతం ఎప్పుడు భావ
వాదాన్ని ప్రబోధిస్తుంది.భావవాదం ఎప్పుడు
భౌతిక వాస్తవాలను చూడలేదు.మార్క్సిస్టు
వర్గ దృక్పధం కార్యసాధన సిద్ధాంతం.ఆది
ఎల్లపుడు భౌతిక వాస్తవాలనే చూస్తుంది.
నమ్ముతుంది.మన దేశంలో భావ వాదమైన
అంబేత్కరిజానికి – కార్య సాధన భౌతిక
సిద్ధాంతమైన మార్క్సిజానికి ఈ వైరుధ్యం
కొనసాగుతూనే వుంటుంది.

కారల్ మార్క్స్,ఎంగెల్స్ కమ్యూనిస్టు ప్రణాళి
కను ప్రవేశపెడుతూ ( 1848 )అభివృద్ధి చెంది
న యూరప్ పెట్టుబడి దారి దోపిడీ సమాజాల
గురించి చేసిన విశ్లేషణలు,సూత్రీకరణలు అర్ధ
వలస,ఫ్యూడల్ భూస్వామ్య వ్యవస్థగల
ఈ నాటి మనదేశ సమాజానికి వర్తిస్తాయని
కొందరు మార్క్సిస్టు – లెనిస్టులు సూత్రీకరిస్తూ
న్నారు.వారు సాంప్రదాయ మార్క్సిస్టు దృక్ప
దంతోనే బ్రిటీష్ వలస వాదుల రాకతోనే
భారత దేశంలో ఫ్యూడలిజం పతనం ప్రారం
భమైనదని అంచనాకు వచ్చినారు.1947
బ్రిటీష్ వలస పాలన నుండి జాతీయ శక్తులు అధికారం చేపట్టిన తరువాత దేశం పెట్టుబడి
దారి దేశంగా అభివృద్ది చెందినదనేది వారి
సూత్రీకరణల సారాంశం.ఈ కారణంగానే
వారు దేశంలో పెట్టుబడిదారి వ్యతిరేక సోష
లిస్టు విప్లవానికి పిలుపుణిస్తున్నారు.

ఇది ఈనాటి భౌతిక పరిస్తితులకు సంబంధం లేని అంచనా.దేశంలో 1946 నుండే ఫ్యూడల్ భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా తెలంగా
ణా సాయుధ పోరాటం అభివృద్ధి చెంది నడి
చింది.1967 నుండి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం
లో నక్సల్ బరి,ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళ
గిరిజన విప్లవోద్యమాలు ఉన్నత స్ధాయికి చేరుకొని సాయుధ పోరాట రూపం తీసుకు
న్నాయి.ఇవన్నీ ఫ్యూడల్ భూస్వామ్య వ్యతి
రేక రైతాంగ ఉద్యమాలేనన్నది సుస్పష్టం.
ఈ అంశాన్ని పెట్టుబడిదారి వ్యతిరేక సోష
లిస్టు విప్లవానికి పిలుపు నిస్తున్నవారు గమ
నించాలి.

యం.యల్ గ్రూపుల్లో కొందరు దేశంలో అర్ధ
వలస,ఫ్యూడల్ అర్ధ భూస్వామ్య వ్యవస్థ
కనుమరుగై పోయిందని,సూత్రీకరించినారు.
వ్యవసాయ రంగంలో పెట్టుబడి దారి విధా
నాలు అమలు అవుతున్నాయని,దేశంలో
వ్యవసాయక విప్లవం అవసరం ఎంత
మాత్రంలేదని నూతన పంథా పేరుతో తమ
కార్యక్రమాలను కొనసాగిస్టన్నారు.వీరి ప్రజా
సమీకరణ పోరాట రూపాలు, నినాదాలు
వారిని క్రమంగా మితవాదం వైపు నడిపిస్తూ
ఉన్నాయని చెప్పడానికి అనేక ఉదాహరణ
లున్నాయి.

ఉభయ కమ్యూనిస్టులలో సి.పి.ఐ. ఉమ్మడి
కమ్యూనిస్టు ఉద్యంలో ఏడు దశాబ్దాల క్రితమే
పై వాదనలు చేసింది.సి.పి.యం.పార్టీ కీ
కాస్త సైద్ధాంతిక దృక్పధం ఎక్కువ కాబట్టి,వారు
దేశంలో భూస్వామ్యం విధానం జనతా ప్రజా
తంత్ర విప్లవమని కొంత భిన్నమైన వాదన
లు చేస్తారు.ఆచరణలో అందుకు దోహదపడే
కార్యాచరణ ఎంత మాత్రం ఉండదు.ఇరువు
రు భారత విప్లవానికి ఏనాడో తిలోదాకాలిచ్చి దశాబ్దాలుగా పార్లమెంటరీ రాజకీయాలలో మునిగి,తేలుతున్న అంశం ప్రజల అనుభవం
ద్వారానే చూసున్నారు.

కామ్రేడ్స్ డి.వి.టి.యన్.లది ఉమ్మడి కమ్యూ
నిస్టు ఉద్యమం నుండి,నేటి విప్లవోద్యమం దా
కా మార్క్సిస్టు – లెనినిస్టు సిద్ధాంత అవగాహన
పునాధి ఏర్పడిన మైత్రి బందం. ఈ దేశంలో
దోపిడీ వర్గ పాలనను కూలద్రోసి జనతా ప్రజా
తంత్ర విప్లవ విజయం కోసం ఇరువురు నేత
లు కంకణం బుద్ధులై తమజీవిత ఆఖరి క్షణం
కృషి చేస్తూ విప్లవోద్యమ నిర్మాణంలో ఉన్నా
రు.ఈ ఇరువురి నాయకుల ఐక్యత విప్లవ
కమ్యూనిస్టు ఉద్యమానికే ఒక ప్రత్యేకత ను
సంతరించి పెట్టింది.

ఈ ఇరువురు నేతలు సి.పి.యం.పార్టీ నయా
రివిజనిస్టు రాజకీయాలతో విభేదించి,భారత
దేశంలో అర్ధవలస,దళారి బడా భూర్జువా,
ఫ్యూడల్ అర్ధ భూస్వామ్య దోపిడీ పానలనకు వ్యతిరేకంగా,చరిత్రాత్మక తెలంగాణా సాయుధ పోరాట అనుభావాలతో తక్షణం సాయుధ పోరా
టానికి దారితీయగల వ్యవసాయక విప్లవ ప్రజా
పంథా కా,డి.వి రూపొందించినారు.కా,టి.యన్
ఆ పంథాను స్వంతం చేసుకోని,ఆనాటికే
నక్సల్ బరి పంథా పేరుతో దేశ వ్యాపితంగా
అమలు జరుగుతున్న చారు మజుందార్ అతి
వాద దుస్సాహసిక పంథా,వర్గ శత్రువు నిర్మూలన( ఖతం కార్యక్రమం ) కార్యక్రమాన్ని ఓడించి నిజమైన విప్లవ శ్రేణులను సమీకరిం
చ గలిగినారు.

ఈ పంథా ఆధారంగా ఆంధ్ర రాష్ట్రంలో వ్యవ
సాయక విప్లవవోద్యమాన్ని అభివృద్ధి చేస్తూ,
దేశవ్యాపితంగా సరైన కార్మికవర్గ విప్లవ పార్టీ నిర్మాణం కోసం అనేక మంది విప్లవ కారులను
కలిసినారు.ఆయన కృషి పలితంగానే అఖిల
భారత స్థాయిలో కమ్యూనిస్టు విపవకారుల సమైక్యతా కేంద్రం, యు.సి.సి.ఆర్.ఐ.( యం.
యల్.)పార్టీ ఏర్పడింది.ఆయన మరణం తరు
వాత పార్టీలో చీలికలు ఏర్పడినాయి.ఇది వేరే అంశం.కామ్రేడ్ టి.యన్.పార్టీలో చీలికలను ఏనాడు ప్రోత్సహించ లేదు.అదే సమయంలో పార్టీ మౌలిక పంథాకు ప్రమాదం ఏర్పడి,సూత్ర
బద్ధమైన చీలికలు అనివార్య మైనప్పుడు వా
టిని వారించనూ లేదు.( సి.పి.రెడ్డితో చీలిక )

భారతదేశంలో బడాభూర్జువా పాలక వర్గాలు,
ఫ్యూడల్ అర్ధ భూస్వామ్య,అర్ధవలస దోపిడీ
పాలన విధానాలను కొనసాగిస్తూ ఉన్నారు.
ఈ దోపిడీ విధానాలను మరుగు పర్చేందుకు
పార్లమెంటరీ ప్రజాస్వామ్యనే ముసుగు తగి
లించుకున్నారు.ఈ పార్లమెంటరీ బూటకపు
ప్రజాస్వామ్యం గురించి కా,డి.వి.ఏమన్నారో,
ఆయన మాటల్లో….

” ఈ పార్లమెంట్ వ్యవస్థ,రాజ్యాంగం ప్రజాస్వా
మ్యమనే ముసుగు తగిలించుకొన్నప్పటికీ,
నిరంకుశత్వమే దానిసారాంశం. మన దేశంలో
సార్వజనీన ఓటు హక్కు అనేది ప్రజాభిప్రా
యాన్ని అంచనా కట్టడానికి ఒక చర్యే,కానీ
అది దోపిడీకి గురి అవుతున్న వర్గాల చేతుల్లో
కి నిజమైన అధికారాన్ని బదలీ చేయదు.సక
ల సంపదలు,ప్రచార సాధానాలు,రాజ్యాధి
కారం,పాలకవర్గం అధిపత్యంలో ఉన్న ప్రస్తు
త పరిస్థితుల్లో విప్లవ శ్రామిక వర్గం ఎన్నికల్లో
మెజారిటీని సాధించడానికి ఎంత మాత్రం
అవకాశంలేదు.ఒకవేళ సాధించిన ఈ దోపిడీ
పాలక వర్గాలు పరిపాలించ నీవ్వరు.జనతా
ప్రజాతంత్ర విప్లవమొకటే ఈ దోపిడీ వ్యవస్థ
ను మార్చగలదు ”

భారత బడా భూర్జువా,సామ్రాజ్యవాద అను
కుల దోపిడీ విధానాల వలన దేశంలో వివిధ
జాతుల మధ్య అసమాన అభివృద్ధి ఉంది.
పాలక వర్గాలు చెప్పుతున్నట్లుగా భారత ప్రజ
లంతా ఒకే జాతికి చెందినవారు కాదు.మన
దేశంలో కులాను కూడా జాతులనే రాజకీయ
వెనుకబాటు వాదనలున్నాయి.మనది బహు
జాతులు గల దేశం.సంస్కృతులు, సంప్రదా
యాలు,మాతృ భాష వైవిధ్యం గల వివిధ జాతుల,తెగలకు చెందిన ప్రజలు నివసిస్తూ
న్న దేశం. కేంద్రంలోని బి.జె.పి.తమ హిందూ మత జాతీయ దూరహంకారం తో దేశంలో
యూనిఫామ్ సివిల్ కోడ్ ( U.C.C.) తేవడా
నికిప్రయత్నిస్తుంది.దీన్ని ప్రజాతంత్ర వాదు
లు ఇతర మైనారిటీ వర్గాల వారు వ్యతిరేకి
స్తూన్నారు.ఈ కామన్ సివిల్ కోడ్ వెనుక ఏక
జాతి , హిందూ రాజ్యం స్థాపించాలనే తమ
భావజాల గురువు అయిన ఆర్.యస్.యస్.
తిరోగమన సిద్ధాంతం ఉన్నది. నినాదంతో హిందూ ఓట్లను సంఘటితపర్చి గంప గుత్తగా కొట్టేయాలనే కుట్రకోణంలో భాగమే.

ఈశాన్య రాష్ట్రాలలో దేశం నుండి విడిపోవాల
నే,స్వయం నిర్ణయాధికారం కోసం జాతీయో
ద్యమాలు దశాబ్దాలుగా జరిగుతున్నాయి.దేశ
సమగ్రత,సమైక్యత పెరుతో పాలక వర్గాలు
ఆ రాష్ట్రాలలో అక్షరాల మిలటరీ పాలనతో ఉక్కు పాదం మోపుతూ ఆ పోరాటాలను అణచి వేస్తూ, తమ దోపిడీ వర్గ పాలన కొన
సాగిస్తున్నారు.మణిపూర్ లో బి.జె.పి.మత
వాద విద్వేష రాజకీయాల వలన రెండు తెగల మధ్య మంటలు చెలరేగినాయి.ఆ రాష్ట్రంలో
మెజారిటీగా ఉన్నహిందూ మెహితీ తెగలకు ఆదివాసీ హోదా కలిపిస్తూ హైకోర్టు తీర్పు
నిచ్చింది.ఆ తీర్పును బి.జె.పి.డబుల్ ఇంజిన్ సర్కారు అమలు చేస్తామనే హామీ నిచ్చింది.
దీంతో మైనారిటీ తెగలుగా ఉన్న ఆదివాసి కుకీలకు ఆగ్రహం కట్టలు తెంచుకొని బి.జె.పి
పార్టీ ఆఫీసును తగలబెట్టినారనే కథనాలు
వస్తున్నాయి.ఈ ఘటనతో రెండు తెగల
మధ్య ఘర్షణచెలరేగినాయి.ఘర్షణలను
నివారించాల్సిన ప్రబుత్వం మెజారిటీగా
హిందూ మెహితీల జరుపుతున్న దాడులను
ప్రోత్సహించింది.రాష్ట్ర ప్రభుత్వ అండతో మణిపూర్ లో కుకీల గ్రామాలకు,గ్రామాలే
తగల బెడుడుతున్నారు.నాగరిక మానవ సమాజం మొత్తం తలదించుకొనే అత్యంత
జుగుప్సా కరమైన ఘటన. ఫ్యూడల్ భూస్వామ్య భావజాలంతో జరిగే వికృత
అమానవీయ సంఘటనలుగా వీటిని
చూడాలి.బి.జె.పి.ప్రజల మతాల పట్ల,తెగల మధ్య బావోద్యగాలను రెచ్చగొట్టే విద్వేష పూరిత రాజకీయాల ఫలితమే మణిపూర్ మంటలు.

మనదేశంలోనే ప్రత్యేకంగా ఉన్న ఈ కులవస్థ,
ఒక తేనెతెట్టే లాంటిది.దాన్ని కదిపితే
పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అందరికి తెలిసిందే.దోపిడీ పాలక వర్గాలు తమ ఓట్ల రాజకీయాలకోసం ఈ కుల వ్యవస్థను నిర్మాణ
యుతంగా కోనసాగిస్తున్నారు.నానాటికి దేశంలోని ప్రజల మధ్య సాంఘీక ఘర్షణలు,
వైశ్యమ్యాలు విపరీతంగా పెరిగి పోతున్నాయి.
ఇందుకు తీవ్రమైన ఆర్ధిక అసమానతలు,
పేదరికం పునాధిగా ఉన్నాయి.సరైన విద్య,
ఉపాధి అవకాశాలు,పెరుగుతున్న నిరుద్యోగం, పడిపోతున్న ప్రజల జీవన ప్రమాణాలు,
ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలు.
ఈ సమస్యల పరిస్కారానికి ప్రజలను
వర్గ పోరాటాల ద్వారా సంఘటితపర్చి
ఉన్నతస్థాయి ప్రజాఉద్యమాన్ని నిర్మించడం తక్షణ కర్తవ్యంగా ఉండాలి.

భారత దేశంలో కొనసాగుతున్న దోపిడీ సా
మాజిక వ్యవస్థను సమూలంగా మార్చు
టకు మార్క్సిజం – లెనినిజం,మావో ఆలోచ
నా విధానానన్ని తమ ప్రాపంచిక దృక్పదంగా
కమ్యూనిస్టు విప్లవ కారులు స్వీకరించినారు.
జనతా ప్రజాతంత్ర విప్లవం నేటి వ్యూహాత్మక
విప్లవ దశగా ప్రకటించినారు.నేటి యుగపు
మార్క్సిజమైన,మావోయిజంలోని మౌలిక సూత్రాలైన ప్రజాయుద్ద పంథా,ఐక్యసంఘ
టన,దీర్ఘ కాల సాయుధ గెరిల్లా పోరాటం,
అనే ఎత్తుగడలను అనుసరించాలి.1946 –
51 దాకా కోనసాగిన తెలంగాణా సాయుధ పోరాట అనుభవాలు,తిరిగి 1967 – 68 లో నక్సల్ బరి,శ్రీకాకుళంసాయుధ పోరాటాల
ను సమీక్షించి,సాయుధ పోరాటానికి దారి
తీయగల వ్యవసాయక విప్లవ ప్రజాపంథా
ను కా,డి.వి.రూపొందించినారు.కా,టి.యన్.
ఈ పంథాను దేశ వ్యాపితంగా ప్రాచుర్యం కలిపించి అత్యున్నత.విప్లవ ప్రమాణాలు
గల కార్మికవర్గ పార్టీని నిర్మించడం కోసం తన తుది శ్వాసవరకు శ్రమించారు.

ఈ పంథా ఆధారంగా భారత దేశంలో నేడు కొనసాగుతూఉన్న దోపిడీ పాలనకు వ్యతి
రేకంగా గ్రామీణ ప్రాంతంలో భూస్వామ్య వ్యతిరేక వర్గ పోరాటాన్ని,వ్యవసాయక విప్ల
వోద్య మాన్ని నిర్మించి జనతా ప్రజాతంత్ర
విప్లవ కర్తవ్యాలను పూర్తి చేసి,సోషలిస్టు వ్యవస్థకు పునాదులు వేయాలి.ఈ విప్లవ
కర్తవ్యాలను పరి పూర్తి చేయడమే,కామ్రేడ్
తరిమెల నాగిరెడ్డి గారికి కమ్యూనిస్టు విప్లవ
కారులుగా మనం అర్పించే నిజమైన విప్లవ
నివాళులు.

* అమరజీవి కామ్రేడ్ టి.యన్.గారికి జోహార్లు.

* మార్క్సిజం – లేనిజం,మావో ఆలోచనా విధా
నం వర్ధిల్లాలి

About The Author

Related Posts