మధ్యప్రదేశ్ లోని మైహార్ దేవాలయాలను దర్శించుకున్న నిర్మల్ జిల్లా వాసులు
భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో షేక్ అహ్మద్, జనవరి 30: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు దేశవిదేశాల నుంచి భక్తులు వస్తున్నారు. హిందూ మతంలోని గొప్పతనం ఇదే అని అంతా ప్రశంసిస్తున్నారు. ఇది నాణేనికి ఒకవైపే. పవిత్ర స్నానాల కోసం ఇంత దూరం వచ్చి చేస్తున్నారు. అమృత స్నానాలు చేసే చోట అన్ని వస్తువులు కలవు. 144 ఏళ్ల తర్వాత వచ్చిన మహాకుంభమేళా ఇది. అందుకే ప్రయాగ్‌రాజ్‌లో ఈ సారి జరుగుతున్న కుంభమేళాకు అందరూ అంత విశిష్టమైనదిగా భావిస్తున్నారు. ఈ సమయంలో ఒక్కసారైనా త్రివేణి సంగమ జలాల్లో పవిత్ర స్నానం ఆచరించాలని దేశవిదేశాల్లో ఉన్న వృద్ధులు, మహిళలు, సాధువులు తరలి వస్తున్నారు. జనాల తాకిడిని దృష్టిలో పెట్టుకుని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వమూ భక్తులు బస చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కిలోమీటర్ల పొడవునా టెంట్లు, తాగు నీటి సౌకర్యం, పోర్టబుల్ టాయిలెట్లు వంటివి ఏర్పాటు చేసింది. రోజూ లక్షల మంది జనాభా వస్తున్నా శానిటైజేషన్ పరంగా ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటోంది. మహా కుంభమేళాలో అమృత స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయనే నమ్మకంతో భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో షేక్ అహ్మద్, జనవరి 30: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు దేశవిదేశాల నుంచి భక్తులు వస్తున్నారు. హిందూ మతంలోని గొప్పతనం ఇదే అని అంతా ప్రశంసిస్తున్నారు. ఇది నాణేనికి ఒకవైపే. పవిత్ర స్నానాల కోసం ఇంత దూరం వచ్చి చేస్తున్నారు. అమృత స్నానాలు చేసే చోట అన్ని వస్తువులు కలవు.
144 ఏళ్ల తర్వాత వచ్చిన మహాకుంభమేళా ఇది. అందుకే ప్రయాగ్‌రాజ్‌లో ఈ సారి జరుగుతున్న కుంభమేళాకు అందరూ అంత విశిష్టమైనదిగా భావిస్తున్నారు. ఈ సమయంలో ఒక్కసారైనా త్రివేణి సంగమ జలాల్లో పవిత్ర స్నానం ఆచరించాలని దేశవిదేశాల్లో ఉన్న వృద్ధులు, మహిళలు, సాధువులు తరలి వస్తున్నారు. జనాల తాకిడిని దృష్టిలో పెట్టుకుని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వమూ భక్తులు బస చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కిలోమీటర్ల పొడవునా టెంట్లు, తాగు నీటి సౌకర్యం, పోర్టబుల్ టాయిలెట్లు వంటివి ఏర్పాటు చేసింది. రోజూ లక్షల మంది జనాభా వస్తున్నా శానిటైజేషన్ పరంగా ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటోంది.
మహా కుంభమేళాలో అమృత స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయనే నమ్మకంతో భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
