నేటి భారతం :

download (1)

తల్లిదండ్రులు లేని పిల్లలు కాదు..  
ప్రేమ చూపించని సమాజమే నిజమైన అనాధల తల్లిదండ్రులు.
ప్రతి అనాధ కళ్లలో ఒక కల ఉంది.. 
ఆ కల నెరవేర్చడం ప్రతి మనిషికి  నిజమైన పరీక్ష.
వారి చేతిలో బొమ్మలు లేవు, కానీ హృదయంలో ఆశ ఉంది.
అనాధ పిల్లవాడి చిరునవ్వు, మన దయకు సాక్ష్యం.
శరీరానికి పరిమితులు ఉన్నా, మనసుకు లేవు.
వికలాంగత కాదు అడ్డంకి.. మన దృష్టికోణమే అసలు బలహీనత.
వారి లోపాలను చూడకండి, వారి ధైర్యాన్ని నేర్చుకోండి.
వికలాంగులు కాదు వారు.. మనకంటే ఎక్కువ బలమైన వారు.
వృద్ధులు మన కుటుంబ చరిత్ర, వారి ఆశీర్వాదం మన భవిష్యత్తు.
వారి చేతులలో ఉన్న ముడతలు, త్యాగాల కథలు చెబుతాయి.
వృద్ధులను గౌరవించడం అంటే కాలాన్ని గౌరవించడం.
వారికి తోడుగా ఉండడం కర్తవ్యమేగాక మనసుకు ఆహ్లాదం.

బోయినపల్లి రమణారావు, సీనియర్ జర్నలిస్ట్.. 

About The Author