వండర్‌ క్రియేట్‌ చేయడానికి నాలుగోసారి!

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌(Allu arjun), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ (Trivikram)కలయికలో ఓ చిత్రం రూపొందనుంది. ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, అల వైకుంఠపురములో’ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబోలో రానున్న నాలుగో చిత్రమిది (Forth Combination). ‘అల వైకుంఠపురములో’ చిత్రం విడుదలైన కొన్నాళ్ల నుంచే బన్నీ, త్రివిక్రమ్‌ కాంబోలో ఓ సినిమా రానుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ వార్తను నిజం చేస్తూ ఇటీవల నిర్మాణ సంస్థలు అధికారిక ప్రకటన ఇచ్చాయి. హారిక & హాసిని క్రియేషన్స్‌తో కలిసి ‘అల వైకుంఠపురములో’ నిర్మాణంలో భాగమైన ప్రసిద్ధ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఇప్పుడు ఈ చిత్ర నిర్మాణంలోనూ భాగం అవుతుంది. ఈ చిత్రాన్ని పద్మశ్రీ అల్లు రామలింగయ్య మరియు శ్రీమతి మమత సమర్పణలో హారిక & హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సోమవారం ‘గురు పౌర్ణమి’ సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ గురించి చెబుతూ ఓ వీడియో విడుదల చేశారు. (AA-Trivikram 4) ‘‘ఎంటర్‌టైన్‌మెంట్‌కి మాస్టర్‌ క్రాఫ్డ్‌ మ్యాన్‌ త్రివిక్రమ్‌, చరిష్మాకు నిర్వచనం అల్లు అర్జున్‌తో విజువల్‌ వండర్‌ను క్రియేట్‌ చేయడానికి నాలుగో సారి కలవడానికి అంతా సిద్ధం. హారికా అండ్‌ హాసిని, గీతా ఆర్ట్స్‌ సంస్థలో ఈసారి మరింత పెద్దగా.. ఇతర వివరాలు త్వరలో’’ అంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు

వండర్‌ క్రియేట్‌ చేయడానికి నాలుగోసారి!

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌(Allu arjun), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ (Trivikram)కలయికలో ఓ చిత్రం రూపొందనుంది. ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, అల వైకుంఠపురములో’ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబోలో రానున్న నాలుగో చిత్రమిది (Forth Combination). ‘అల వైకుంఠపురములో’ చిత్రం విడుదలైన కొన్నాళ్ల నుంచే బన్నీ, త్రివిక్రమ్‌ కాంబోలో ఓ సినిమా రానుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ వార్తను నిజం చేస్తూ ఇటీవల నిర్మాణ సంస్థలు అధికారిక ప్రకటన ఇచ్చాయి. హారిక & హాసిని క్రియేషన్స్‌తో కలిసి ‘అల వైకుంఠపురములో’ నిర్మాణంలో భాగమైన ప్రసిద్ధ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఇప్పుడు ఈ చిత్ర నిర్మాణంలోనూ భాగం అవుతుంది. ఈ చిత్రాన్ని పద్మశ్రీ అల్లు రామలింగయ్య మరియు శ్రీమతి మమత సమర్పణలో హారిక & హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సోమవారం ‘గురు పౌర్ణమి’ సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ గురించి చెబుతూ ఓ వీడియో విడుదల చేశారు. (AA-Trivikram 4)

‘‘ఎంటర్‌టైన్‌మెంట్‌కి మాస్టర్‌ క్రాఫ్డ్‌ మ్యాన్‌ త్రివిక్రమ్‌, చరిష్మాకు నిర్వచనం అల్లు అర్జున్‌తో విజువల్‌ వండర్‌ను క్రియేట్‌ చేయడానికి నాలుగో సారి కలవడానికి అంతా సిద్ధం. హారికా అండ్‌ హాసిని, గీతా ఆర్ట్స్‌ సంస్థలో ఈసారి మరింత పెద్దగా.. ఇతర వివరాలు త్వరలో’’ అంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు

About The Author

Related Posts