అన్నదమ్ముల మధ్య ఇగోలు ఉండకూడదు!

సంపూర్ణేష్‌ బాబు (Sampoornesh babu) తనకు సోదరుడిలాంటివాడని మంచు మనోజ్‌ (manchu manoj) అన్నారు. ‘సోదరా’ (Sodara) సినిమాలో పాట ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు మనోజ్‌. సంపూర్ణేశ్‌బాబు, సంజోష్‌ ప్రధాన పాత్రల్లో మన్మోహన్‌ మేనంపల్లి తెరకెక్కించిన చిత్రమిది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్సలో భాగంగా పాటని విడుదల చేశారు. ఈ సందర్భంగా మనోజ్‌ మాట్లాడుతూ ‘‘సంపూర్షేష్‌బాబు ఎంత మంచివాడో ఆయన నవ్వే చెబుతుంది. ఆయన్ను చూస్తుంటే.. ప్రమాదంలో చనిపోయిన మా బాబాయ్‌ కొడుకు మా ప్రసాద్‌ అన్నయ్య గుర్తొస్తుంటాడు. ఈ ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉంది. ఇలాంటి ఫ్యామిలీ ఎమోషన్స్‌ సినిమాలో సంపూ నటిస్తే ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అవుతారు. సోదరుల మధ్య అనుబంధం ప్రత్యేకంగా ఉంటుంది. అన్నదమ్ముల మధ్య ఇగోలు ఉండకూడదు. ఇద్దరి మధ్య సమస్యలను చూస్తున్నామంటే వారు కూర్చొని మాట్లాడుకోవట్లేదని అర్థం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గాలి. అప్పుడే ప్రయాణం బాగుంటుంది. బ్రదర్స్‌ ఎమోషన్స్‌పై ఈ చిత్రాన్ని తీయడం సంతోషం. ‘సోదరా’ సినిమా మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం మంచు మనోజ్‌ వరుణ్‌ కోరుకొండ దర్శకత్వంలో ‘వాట్‌ ది ఫిష్‌’ చిత్రంలో నటిస్తున్నారు.

About The Author

Related Posts