ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ , కాంగ్రెస్ లను “ఛీ” కొట్టారు: బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి

కరీంనగర్, ఫిబ్రవరి 8(భారత శక్తి): ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి చరిత్ర తిరగరాసిందని , 20 ఏళ్లకు ఢిల్లీ పీఠం పార్టీ కైవసం చేసుకుందని జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి భారీ విజయం సాధించిన నేపథ్యంలో జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్ లో స్విట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆమ్‌ ఆద్మీ పార్టీ పాలనకు ఢిల్లీ ప్రజలు చరమగీతం పాడారని, చారిత్రకమైన తీర్పునిచ్చిన ఢిల్లీ ఓటర్లకు జిల్లా శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియచేశారు.. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదం గట్టిగానే పనిచేసిందన్నారు. ఎన్నడూ లేనివిధంగా బీజేపీ కి దళిత, ఓబీసీ ఓటర్లు మద్దతు లభిచిందన్నారు.మరోవైపు ఆమ్‌ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీ చేసిన రాజకీయ కుట్రలను ఢిల్లీ ప్రజలు తిప్పి కొట్టారని చెప్పారు. దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందని, హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పరిస్థితి పూర్తిగా దిగజారి పోయిందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి జెండా ఎగురుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ రావు , ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు కన్నబోయిన ఓదెలు, కరీంనగర్ పార్లమెంటు కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు ,నాయకులు సాయిని మల్లేశం, దండు కొమురయ్య, పుప్పాల రఘు, లింగంపల్లి శంకర్, నాగసముద్రం ప్రవీణ్, సురేష్, ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ , కాంగ్రెస్ లను “ఛీ” కొట్టారు: బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి

కరీంనగర్, ఫిబ్రవరి 8(భారత శక్తి):
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి చరిత్ర తిరగరాసిందని , 20 ఏళ్లకు ఢిల్లీ పీఠం పార్టీ కైవసం చేసుకుందని జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి భారీ విజయం సాధించిన నేపథ్యంలో జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్ లో స్విట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆమ్‌ ఆద్మీ పార్టీ పాలనకు ఢిల్లీ ప్రజలు చరమగీతం పాడారని, చారిత్రకమైన తీర్పునిచ్చిన ఢిల్లీ ఓటర్లకు జిల్లా శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియచేశారు.. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదం గట్టిగానే పనిచేసిందన్నారు. ఎన్నడూ లేనివిధంగా బీజేపీ కి దళిత, ఓబీసీ ఓటర్లు మద్దతు లభిచిందన్నారు.మరోవైపు ఆమ్‌ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీ చేసిన రాజకీయ కుట్రలను ఢిల్లీ ప్రజలు తిప్పి కొట్టారని చెప్పారు. దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందని, హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పరిస్థితి పూర్తిగా దిగజారి పోయిందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి జెండా ఎగురుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ రావు , ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు కన్నబోయిన ఓదెలు, కరీంనగర్ పార్లమెంటు కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు ,నాయకులు సాయిని మల్లేశం, దండు కొమురయ్య, పుప్పాల రఘు, లింగంపల్లి శంకర్, నాగసముద్రం ప్రవీణ్, సురేష్, ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About The Author