పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి

కరీంనగర్, ఫిబ్రవరి 7(భారత శక్తి): కరీంనగర్, మెదక్, నిజామాబాద్, అదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆల్పోర్స్ విద్యాసంస్థల ఛైర్మన్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి ఛాంబర్లో నామినేషన్ వేశారు. ముందుగా నగరంలోని మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, వేదపండితుల, తల్లితండ్రులు ఆశీర్వాదం తీసుకొని నామినేషన్ వేశారు. అనంతరం నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా భారీ మెజారిటీ తో గెలిచి… సీఎం రేవంత్ రెడ్డి, సోనియాగాంధీకి గిఫ్ట్ ఇస్తాననీ చెప్పారు. తనపై నమ్మకంతో టికెట్ కేటాయించిన కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదములు తెలియజేశారు. కాంగ్రెస్ నమ్మకాన్ని నిలబెడతానని, ఫిబ్రవరి 10వ తేదీన రెండో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నానని స్పష్టం చేశారు. నామినేషన్ కోసం పెద్దఎత్తున బారి ర్యాలీనీ కలెక్టరేట్ వరకు వస్తుందనీ చెప్పారు. కాంగ్రెస్ నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించిందని కొనియాడారు. పార్టీ పథకాలతోపాటుగా నరేంద్రుడి నవరత్నాలు పేరిట మేనిఫెస్టోతో పట్టభద్రుల వద్దకు చేరుకోబోతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డితోపాటు ఆయన కుటుంబీకులు, సన్నిహితులు పాల్గొన్నారు..

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి

కరీంనగర్, ఫిబ్రవరి 7(భారత శక్తి):
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, అదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆల్పోర్స్ విద్యాసంస్థల ఛైర్మన్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి ఛాంబర్లో నామినేషన్ వేశారు. ముందుగా నగరంలోని మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, వేదపండితుల, తల్లితండ్రులు ఆశీర్వాదం తీసుకొని నామినేషన్ వేశారు. అనంతరం నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా భారీ మెజారిటీ తో గెలిచి… సీఎం రేవంత్ రెడ్డి, సోనియాగాంధీకి గిఫ్ట్ ఇస్తాననీ చెప్పారు. తనపై నమ్మకంతో టికెట్ కేటాయించిన కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదములు తెలియజేశారు. కాంగ్రెస్ నమ్మకాన్ని నిలబెడతానని, ఫిబ్రవరి 10వ తేదీన రెండో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నానని స్పష్టం చేశారు. నామినేషన్ కోసం పెద్దఎత్తున బారి ర్యాలీనీ కలెక్టరేట్ వరకు వస్తుందనీ చెప్పారు. కాంగ్రెస్ నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించిందని కొనియాడారు. పార్టీ పథకాలతోపాటుగా నరేంద్రుడి నవరత్నాలు పేరిట మేనిఫెస్టోతో పట్టభద్రుల వద్దకు చేరుకోబోతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డితోపాటు ఆయన కుటుంబీకులు, సన్నిహితులు పాల్గొన్నారు..

About The Author