సింగపూర్ లో ఘనంగా బతుకమ్మ పండుగ వేడుకలు

వేములవాడ :

WhatsApp Image 2025-09-30 at 6.43.54 PM

తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు స్థానిక  సంబవాంగ్ పార్క్ లో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యంత కోలాహలంగా కన్నుల పండుగగా బతుకమ్మ పండుగ వేడుకలను నిర్వహించారు. బతుకమ్మ సాంప్రదాయ పాటలతో చిన్న పెద్ద తేడా లేకుండా అందరు ఆటపాటలతో ఎంతో హుషారుగా  వేడుకలు అంబరాన్నంటాయి. భారతదేశం నుండి వచ్చిన స్థానికుల తల్లిదండ్రులు, బంధువులు కూడా ఈ వేడుకలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని కమిటీ సభ్యులు తమ సంతోషాన్ని వ్యక్తపరిచార. ఈ  సంబరాల్లో సింగపూర్ స్థానికులతో పాటు ఎంతో మంది అతిథులు ఎన్నారైలు 3000 మంది వరకు పాల్గొని బతుకమ్మ ఆడారు.ఈ వేడుకలలో పాల్గొన్న అంతర్జాతీయ శ్రీ కృష్ణ మందిరం,సింగపూర్ లో నివసిస్తున్న తెలుగు వారందరికీ స్థానికులకు బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను తెలియజేస్తు దశాబ్దానికి పైగా సింగపూర్ లో బతుకమ్మ పండుగకు విశేష ఆదరణ కలుగజేయడం ద్వార బతుకమ్మ వైభవాన్ని చాటి చెప్పుతూ తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ చరిత్రలో నిలిచిపోవడం జరిగిందని సొసైటీ సభ్యులు అన్నారు. ఇతర సంస్థలు కూడా బతుకమ్మ నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. సంబరాలు విజయవంతంగా జరుగుటకు సహాయ సహకారాలు అందించిన దాతలకు పేరు పేరున  ప్రతి ఒక్కరికి  టీసీఎస్‌ఎస్‌ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేస్తు ప్లాటినం, గోల్డ్, సిల్వర్ కేటగిరీ కార్పొరేట్ వ్యక్తిగత దాతలను శాలువాలతో సన్మానించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.ఆడపడుచులు బతుకమ్మలని పోటా పోటీగా చాలా అందంగా అలంకరించి బతుకమ్మలని పేర్చి తీసుకొచ్చారు. బతుకమ్మని పేర్చి తెచ్చిన ప్రతి ఆడపడుచుని రెడ్ కార్పెట్ పై స్వాగతించి తనిష్క్ జ్యూవెల్లర్స్ వారి గిఫ్ట్ హాంపర్ని బహుమతిగా అందజేశారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన 11 బతుకమ్మలకు, ప్రత్యేక సాంప్రదాయ ఉత్తమ వస్త్రధారణలో ముస్తాబైన ముగ్గురు ఆడపడుచులకు సౌజన్య డెకార్స్ వెండి వస్తువులు,బిఎస్కే కలెక్షన్స్ సారీస్, కెఎస్ పట్టు ఫ్యాషన్స్ సారీస్, వియోమి ఫ్యాషన్స్ సారీస్ ప్రత్యేక బహుమతులు అందజేశారు.

About The Author