కార్మిక వ్యతిరేక బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ జిల్లా కేంద్రంలో సిఐటియు నిరసన

(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, ఫిబ్రవరి 05: కేంద్ర బిజెపి ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మికులకు కర్షకులకు ప్రజలకు వ్యతిరేకంగా సంపన్న వర్గాలకు మేలు చేసే విధంగా ఈ బడ్జెట్ ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కామారెడ్డి ఆర్డీఓ ఆఫీస్ ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ,కేంద్ర బడ్జెట్ తీరు చూస్తే ఈ ప్రభుత్వం ఎవరి కోసం పని చేస్తుందో అర్థం అవుతుందని తీవ్రంగా మండిపడ్డారు. కార్పొరేట్ సంపన్న వర్గాలకు దేశ సంపద దోచి పెట్టే విధంగా బడ్జెట్ రూపకల్పన చేయడం బిజెపి మతోన్మాద ఆర్థిక దివాలకోరు తనానికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశంలో సంపద సృష్టించే కార్మికులు కర్షకులు మున్సిపల్ గ్రామపంచాయతీ ఆశ వర్కర్లు,అంగన్వాడి, మధ్యాహ్న బోజనం, ఐకేపీ, అసంఘటిత రంగ కార్మికులకు పేదలు ప్రజల పైన భారాల మోపే పద్ధతిలో ఈ బడ్జెట్ ఉండడం సిగ్గుచేటు అన్నారు. కార్మికుల కనీస వేతనాలు పెంచే ఆలోచన ఈ బడ్జెట్ లో లేదన్నారు. ఈ బడ్జెట్ దేశంలో పేదరికం నిరుద్యోగం సామాన్యులపై ధరల భారం పెరిగే విధంగా ఉందని ఈ బడ్జెట్ ను ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని కోరారు. బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ అంబానీ ఆదాని బడా కార్పొరేట్ శక్తులకు గులాంగిరి చేస్తుందని ఈ విధానాలను ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. రాబోయే కాలంలో కార్మిక వర్గం కార్పొరేట్ పెట్టుబడిదారులకు ఊడిగం చేసే బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడానికి సిద్ధంకావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రాజనర్సు,ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అరుణ్,మున్సిపల్ ఉపాధ్యక్షులు ప్రభు నాయకులు సంతోష్, నరేష్, ప్రభాకర్, సాయిలు, శ్రీనివాస్, యాదగిరి, ప్రశాంత్, మల్లేష్, రాజ్,కళ్యాన్,లింగం, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

కార్మిక వ్యతిరేక బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ జిల్లా కేంద్రంలో సిఐటియు నిరసన

(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, ఫిబ్రవరి 05: కేంద్ర బిజెపి ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మికులకు కర్షకులకు ప్రజలకు వ్యతిరేకంగా సంపన్న వర్గాలకు మేలు చేసే విధంగా ఈ బడ్జెట్ ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కామారెడ్డి ఆర్డీఓ ఆఫీస్ ముందు నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ,కేంద్ర బడ్జెట్ తీరు చూస్తే ఈ ప్రభుత్వం ఎవరి కోసం పని చేస్తుందో అర్థం అవుతుందని తీవ్రంగా మండిపడ్డారు. కార్పొరేట్ సంపన్న వర్గాలకు దేశ సంపద దోచి పెట్టే విధంగా బడ్జెట్ రూపకల్పన చేయడం బిజెపి మతోన్మాద ఆర్థిక దివాలకోరు తనానికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశంలో సంపద సృష్టించే కార్మికులు కర్షకులు మున్సిపల్ గ్రామపంచాయతీ ఆశ వర్కర్లు,అంగన్వాడి, మధ్యాహ్న బోజనం, ఐకేపీ, అసంఘటిత రంగ కార్మికులకు పేదలు ప్రజల పైన భారాల మోపే పద్ధతిలో ఈ బడ్జెట్ ఉండడం సిగ్గుచేటు అన్నారు. కార్మికుల కనీస వేతనాలు పెంచే ఆలోచన ఈ బడ్జెట్ లో లేదన్నారు. ఈ బడ్జెట్ దేశంలో పేదరికం నిరుద్యోగం సామాన్యులపై ధరల భారం పెరిగే విధంగా ఉందని ఈ బడ్జెట్ ను ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని కోరారు. బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ అంబానీ ఆదాని బడా కార్పొరేట్ శక్తులకు గులాంగిరి చేస్తుందని ఈ విధానాలను ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. రాబోయే కాలంలో కార్మిక వర్గం కార్పొరేట్ పెట్టుబడిదారులకు ఊడిగం చేసే బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడానికి సిద్ధంకావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రాజనర్సు,ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అరుణ్,మున్సిపల్ ఉపాధ్యక్షులు ప్రభు నాయకులు సంతోష్, నరేష్, ప్రభాకర్, సాయిలు, శ్రీనివాస్, యాదగిరి, ప్రశాంత్, మల్లేష్, రాజ్,కళ్యాన్,లింగం, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

About The Author