కుల గణన సర్వే పేరుతో కాంగ్రెస్ 150 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసింది : బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్
కరీంనగర్, ఫిబ్రవరి 4(భారత శక్తి): తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా కుల గణన సర్వే చేపట్టామని, దేశానికే రోల్ మోడల్ గా కుల సర్వే నిలుస్తుందని ముఖ్యమంత్రి, మంత్రులు ప్రగల్బాలు పలుకుతు కాంగ్రెస్ 150 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చుచేసి ఏం సాధించిందని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్. ప్రశ్నించారు. మంగళవారం కరీంనగర్ లోఆయన మాట్లాడుతూ 150 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కూడా సరైన రిపోర్టును కాంగ్రెస్ సర్కస్ రాబట్టు కోలేకపోయిందని, గత బిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన బీసీ లెక్కలకు , నేడు కాంగ్రెస్ చెబుతున్న బీసీ లెక్కలకు తేడా ఉన్నట్టు , దాదాపు 21 లక్షల బీసీలు తగ్గారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న లేవనెత్తిన ప్రశ్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. కులాల సర్వే కోసం 150 కోట్ల ప్రజాధనాన్ని కాంగ్రెస్ వృధా చేసిందని , ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో ప్రజలు సర్వేను తిరస్కరించారన్నారు. ప్రధానంగా కుల గణన సర్వే సమయంలో అనుచిత ప్రశ్నల అవసరాన్ని ప్రశ్నిస్తూ ప్రజలు సర్వేలో పాల్గొనడానికి నిరాకరించారన్నారు. ప్రభుత్వ సర్వే కంటే , ఓటర్లను తారుమారు చేయడానికి, కాంగ్రెస్ నెరవేర్చని వాగ్దానాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన రాజకీయ స్టంట్ అని ఆయన ఆరోపించారు.కులగనన సర్వే సఫలమైన విధానం కాదని విఫలమైన విధానమన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తేల్చిన లెక్క ప్రకారం అయినా 50 శాతం పైగా బీసీలు ఉన్నందున, కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు రాబోయే ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కచ్చితంగా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
కరీంనగర్, ఫిబ్రవరి 4(భారత శక్తి):
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా కుల గణన సర్వే చేపట్టామని, దేశానికే రోల్ మోడల్ గా కుల సర్వే నిలుస్తుందని ముఖ్యమంత్రి, మంత్రులు ప్రగల్బాలు పలుకుతు కాంగ్రెస్ 150 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చుచేసి ఏం సాధించిందని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్. ప్రశ్నించారు. మంగళవారం కరీంనగర్ లోఆయన మాట్లాడుతూ 150 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కూడా సరైన రిపోర్టును కాంగ్రెస్ సర్కస్ రాబట్టు కోలేకపోయిందని, గత బిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన బీసీ లెక్కలకు , నేడు కాంగ్రెస్ చెబుతున్న బీసీ లెక్కలకు తేడా ఉన్నట్టు , దాదాపు 21 లక్షల బీసీలు తగ్గారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న లేవనెత్తిన ప్రశ్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. కులాల సర్వే కోసం 150 కోట్ల ప్రజాధనాన్ని కాంగ్రెస్ వృధా చేసిందని , ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో ప్రజలు సర్వేను తిరస్కరించారన్నారు. ప్రధానంగా కుల గణన సర్వే సమయంలో అనుచిత ప్రశ్నల అవసరాన్ని ప్రశ్నిస్తూ ప్రజలు సర్వేలో పాల్గొనడానికి నిరాకరించారన్నారు. ప్రభుత్వ సర్వే కంటే , ఓటర్లను తారుమారు చేయడానికి, కాంగ్రెస్ నెరవేర్చని వాగ్దానాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన రాజకీయ స్టంట్ అని ఆయన ఆరోపించారు.కులగనన సర్వే
సఫలమైన విధానం కాదని విఫలమైన విధానమన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తేల్చిన లెక్క ప్రకారం అయినా 50 శాతం పైగా బీసీలు ఉన్నందున, కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు రాబోయే ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కచ్చితంగా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
