ఎల్ఐసి ఉద్యోగుల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం

హనుమకొండ ప్రతినిధి(భారత శక్తి)ఫిబ్రవరి11: ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ పిలుపు మేరకు ఐసీఈయూ వరంగల్ డివిజన్ ఆధ్వర్యంలో మంగళవారం ఎల్ఐసి డివిజనల్ ఆఫీసు కార్యాలయం ముందు “లంచ్ అవర్ దేమాన్స్ట్రేషన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఐ.సి.ఈ యూ వరంగల్ డివిజన్ అధ్యక్షుడు కామ్రేడ్ బి.శ్రీహరి మాట్లాడుతూ ఎల్ఐసిలో పదవీ విరమణ చేసే ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని,అదే రీతిలో ఎల్ఐసిలో ఉద్యోగాల నియామాకాల ప్రక్రియ జరగడం లేదన్నారు. పెరుగుతున్న పోటీని తట్టుకోవాలంటే ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎల్ఐసి లో వెంటనే మూడు,నాలుగు క్యాడర్లలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఎల్ఐసి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.ఈ పోటీ ప్రపంచంలోనే కస్టమర్ల ఆశలకు అనుగుణంగా పనిచేయడానికి వీలవుతుందన్నారు.అదేవిధంగా ఏ.ఐ.ఐ.ఈ.ఏ.1951 లో కార్మిక సంఘంగా ఆవిర్భవించి, ఎల్ఐసి పటిష్టతకై అహర్నిశలు పోరాడుతూ,ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు పాటుపడుతున్న ఏ.ఐ.ఐ.ఈ.ఏను గుర్తింపు సంఘంగా ఎల్ఐసి యాజమాన్యం గుర్తించాలని డిమాండ్ చేశారు.నిరసన కార్యక్రమం అనంతరం వరంగల్ సీనియర్ డివిజనల్ మేనేజర్ ఎం.సుబ్రమణియన్ ను కలిసి,ఏ.ఐ.ఐ.ఈ.ఏ ప్రధాన డిమాండ్ లు అయినటువంటి క్లాస్ త్రీ అండ్ ఫోర్ క్యాడర్లలో రిక్రూట్మెంట్ వెంటనే చేపట్టడం గురించి వివరించడం జరిగిందన్నారు.అలాగే ఎల్ఐసిలో సత్వరమే ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కు ఎల్ఐసిలో గుర్తింపు నివ్వాలని పేర్కొంటూ వినతి పత్రాన్ని సమర్పించడం జరిగిందన్నారు.కేంద్రస్థాయి యాజమాన్యానికి ఇట్టి వినతిని చేరవేయవలసిందిగా ఐ.సి.ఈ.యూ.వరంగల్ డివిజన్ నాయకత్వం సీనియర్ డివిజనల్ మేనేజర్ ను అభ్యర్థించనైనది.ఈ కార్యక్రమంలో ఐ.సి.ఈ.యూ.వరంగల్ డివిజన్,జాయింట్ సెక్రటరీలు కామ్రేడ్ కె.నాగభూషణం, కామ్రేడ్ ఏ.చంద్రశేఖర్,డివో బేస్ యూనిట్ ప్రెసిడెంట్, కామ్రేడ్ సంధ్యారాణి,కామ్రేడ్ కళ్యాణి,కవిత,రవిరాజ్, పద్మజ,సుమ,స్వరూపారాణి, వెంకటరమణ,మోడం వెంకటేశ్వర్లు,పాపిరెడ్డి,శీలం యాదగిరి,కామ్రేడ్ శ్యాంసుందర్,ఇతర సీనియర్ కామ్రేడ్స్ పాల్గొన్నారు.

ఎల్ఐసి ఉద్యోగుల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం

హనుమకొండ ప్రతినిధి(భారత శక్తి)ఫిబ్రవరి11:

ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ పిలుపు మేరకు ఐసీఈయూ వరంగల్ డివిజన్ ఆధ్వర్యంలో మంగళవారం ఎల్ఐసి డివిజనల్ ఆఫీసు కార్యాలయం ముందు “లంచ్ అవర్ దేమాన్స్ట్రేషన్స్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఐ.సి.ఈ యూ వరంగల్ డివిజన్ అధ్యక్షుడు కామ్రేడ్ బి.శ్రీహరి మాట్లాడుతూ ఎల్ఐసిలో పదవీ విరమణ చేసే ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని,అదే రీతిలో ఎల్ఐసిలో ఉద్యోగాల నియామాకాల ప్రక్రియ జరగడం లేదన్నారు. పెరుగుతున్న పోటీని తట్టుకోవాలంటే ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎల్ఐసి లో వెంటనే మూడు,నాలుగు క్యాడర్లలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఎల్ఐసి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.ఈ పోటీ ప్రపంచంలోనే కస్టమర్ల ఆశలకు అనుగుణంగా పనిచేయడానికి వీలవుతుందన్నారు.అదేవిధంగా ఏ.ఐ.ఐ.ఈ.ఏ.1951 లో కార్మిక సంఘంగా ఆవిర్భవించి, ఎల్ఐసి పటిష్టతకై అహర్నిశలు పోరాడుతూ,ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు పాటుపడుతున్న ఏ.ఐ.ఐ.ఈ.ఏను గుర్తింపు సంఘంగా ఎల్ఐసి యాజమాన్యం గుర్తించాలని డిమాండ్ చేశారు.నిరసన కార్యక్రమం అనంతరం వరంగల్ సీనియర్ డివిజనల్ మేనేజర్ ఎం.సుబ్రమణియన్ ను కలిసి,ఏ.ఐ.ఐ.ఈ.ఏ
ప్రధాన డిమాండ్ లు అయినటువంటి క్లాస్ త్రీ అండ్ ఫోర్ క్యాడర్లలో రిక్రూట్మెంట్ వెంటనే చేపట్టడం గురించి వివరించడం జరిగిందన్నారు.అలాగే ఎల్ఐసిలో సత్వరమే ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కు ఎల్ఐసిలో గుర్తింపు నివ్వాలని పేర్కొంటూ వినతి పత్రాన్ని సమర్పించడం జరిగిందన్నారు.కేంద్రస్థాయి యాజమాన్యానికి ఇట్టి వినతిని చేరవేయవలసిందిగా ఐ.సి.ఈ.యూ.వరంగల్ డివిజన్ నాయకత్వం సీనియర్ డివిజనల్ మేనేజర్ ను అభ్యర్థించనైనది.ఈ కార్యక్రమంలో ఐ.సి.ఈ.యూ.వరంగల్ డివిజన్,జాయింట్ సెక్రటరీలు కామ్రేడ్ కె.నాగభూషణం, కామ్రేడ్ ఏ.చంద్రశేఖర్,డివో బేస్ యూనిట్ ప్రెసిడెంట్, కామ్రేడ్ సంధ్యారాణి,కామ్రేడ్ కళ్యాణి,కవిత,రవిరాజ్, పద్మజ,సుమ,స్వరూపారాణి, వెంకటరమణ,మోడం వెంకటేశ్వర్లు,పాపిరెడ్డి,శీలం యాదగిరి,కామ్రేడ్ శ్యాంసుందర్,ఇతర సీనియర్ కామ్రేడ్స్ పాల్గొన్నారు.

About The Author