ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

WhatsApp Image 2025-11-24 at 4.10.09 PM

ఉమ్మడి ఆదిలాబాద్ : 

Read More నేటి భారతం :

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు.
      
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి దరఖాస్తును పరిశీలించి తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. మండలాల వారీగా పెండింగ్ లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు. 
     
ప్రజావాణి కార్యక్రమం అనంతరం కార్మిక శాఖకు సంబంధించిన, కార్మికుల ప్రమాద బీమా పెంపు సమాచార గోడ ప్రతులను కలెక్టర్, అధికారులు ఆవిష్కరించారు.ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ ఆర్డీవో రత్నకళ్యాణి, జెడ్పి సీఈవో గోవింద్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Read More ఎన్నికల నియమాలను పాటించాలి : లోకేశ్వరం ఎస్.ఐ. అశోక్.

About The Author