అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాణ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్

(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, ఫిబ్రవరి 03: ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ సదాశివానగర్ మండల కేంద్రంలో అపురూప అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాణ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాల క్రితం ఈ గుడికి వచ్చినప్పుడు నా వంతుగా అయ్యప్ప స్వామి వారికి సేవా చేస్తానని మాట ఇచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం నా వంతుగా సేవా చేసానని తెలిపారు. గుడికి సంబంధించిన ఎటువంటి సహాయం అయిన చేస్తానని ప్రభుత్వంతో మాట్లాడి గుడికి అవసరమున్న సౌకర్యాలు అన్నీ పూర్తిచేస్తానని తెలియచేసారు. సోమవారం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి నేను రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అనంతరం భక్తులతో కలిసి తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,గ్రామ పెద్దలు, అశేషంగా భక్తులు పాల్గొన్నారు.

అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాణ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్

(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, ఫిబ్రవరి 03: ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ సదాశివానగర్ మండల కేంద్రంలో అపురూప అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాణ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాల క్రితం ఈ గుడికి వచ్చినప్పుడు నా వంతుగా అయ్యప్ప స్వామి వారికి సేవా చేస్తానని మాట ఇచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం నా వంతుగా సేవా చేసానని తెలిపారు. గుడికి సంబంధించిన ఎటువంటి సహాయం అయిన చేస్తానని ప్రభుత్వంతో మాట్లాడి గుడికి అవసరమున్న సౌకర్యాలు అన్నీ పూర్తిచేస్తానని తెలియచేసారు. సోమవారం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి నేను రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అనంతరం భక్తులతో కలిసి తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,గ్రామ పెద్దలు, అశేషంగా భక్తులు పాల్గొన్నారు.

About The Author