అమరులను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు శాంతియుతంగా, అహింస మార్గం లో నడవాలి: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి) జనవరి 30: నాటి అమరుల త్యాగాలే నేడు మనం అనుభవిస్తున్న స్వతంత్ర ఫలాలు అని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.గురువారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరం లో జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు తో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్బంగా అమరవీరుల దినోత్సవం లో పాల్గొని అమరవీరులను స్మరించుకుంటూ 2 నిముషాలు మౌనం పాటించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమం లో, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాపాడుకోవటానికి ఎందరో మహనీయులు సత్యాగ్రహమే ఆయుధంగా, అహింస మార్గంలో పోరాడి అద్భుతమైన సాహసం, ధైర్యాన్ని చూపుతూ ప్రాణం పోయిన లెక్క చేయకుండా దేశానికి స్వాతంత్ర్యమే ముఖ్యమని భారత జాతికి స్వేచ్చ, స్వాతంత్ర్యలు అందించారని వారి త్యాగాలను నేడు గుర్తు చేసుకుంటూ నివాళులు ఆర్పించటమే కాకుండా అమరులను స్ఫూర్తి గా తీసుకొని శాంతియుతంగా, అహింసా మార్గం లో దేశానికి, ప్రజలకి సేవ చేసేందుకు ముందుకు నడవాలని కలెక్టర్ అధికారులకి సూచించారు.ఈ కార్యక్రమం లో డి ఆర్ డి ఓ పి డి వి వి అప్పారావు,హౌజింగ్ ఈ ఈ ధర్మారెడ్డి,డి పి ఓ నారాయణ రెడ్డి,డి ఈ ఓ అశోక్,డి డబ్ల్యూ ఓ నరసింహారావు, ఎంపిడిఓ లు,ఎం పి ఓ లు,అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అమరులను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు శాంతియుతంగా, అహింస మార్గం లో నడవాలి: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి) జనవరి 30:

నాటి అమరుల త్యాగాలే నేడు మనం అనుభవిస్తున్న స్వతంత్ర ఫలాలు అని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.గురువారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరం లో జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు తో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్బంగా అమరవీరుల దినోత్సవం లో పాల్గొని అమరవీరులను స్మరించుకుంటూ 2 నిముషాలు మౌనం పాటించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమం లో, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాపాడుకోవటానికి ఎందరో మహనీయులు సత్యాగ్రహమే ఆయుధంగా, అహింస మార్గంలో పోరాడి అద్భుతమైన సాహసం, ధైర్యాన్ని చూపుతూ ప్రాణం పోయిన లెక్క చేయకుండా దేశానికి స్వాతంత్ర్యమే ముఖ్యమని భారత జాతికి స్వేచ్చ, స్వాతంత్ర్యలు అందించారని వారి త్యాగాలను నేడు గుర్తు చేసుకుంటూ నివాళులు ఆర్పించటమే కాకుండా అమరులను స్ఫూర్తి గా తీసుకొని శాంతియుతంగా, అహింసా మార్గం లో దేశానికి, ప్రజలకి సేవ చేసేందుకు ముందుకు నడవాలని కలెక్టర్ అధికారులకి సూచించారు.ఈ కార్యక్రమం లో డి ఆర్ డి ఓ పి డి వి వి అప్పారావు,హౌజింగ్ ఈ ఈ ధర్మారెడ్డి,డి పి ఓ నారాయణ రెడ్డి,డి ఈ ఓ అశోక్,డి డబ్ల్యూ ఓ నరసింహారావు, ఎంపిడిఓ లు,ఎం పి ఓ లు,అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About The Author