
కామారెడ్డి జిల్లా :
గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ, జిల్లాలో రైస్ మిల్లర్లు దోపిడీని అరికట్టాలని దోపిడీ చేస్తున్న రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రైస్ మిల్లర్లలో కొందరు అన్నదాతలను నిలువునా దోపిడీ చేస్తున్నారని వారి దోపిడిని వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు. వరి ధాన్యం కొనుగోలు సెంటర్లనుండి అదనంగా కొందరు రైస్ మిల్లు యజమానులు 5 నుండి 8 కిలోల వరకు రైతులు నుండి తరుగు పేరుతో రైస్ మిల్లర్లు సోమ్ము చేసుకుంటున్నారని సెంటర్ నిర్వాహకులకు సైతం రైస్ మిల్లర్లు ఇబ్బందులు పెడుతున్నారన్నారు అలాంటి రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి అవినీతికి పాల్పడుతున్న రైస్ మిల్లులపై చర్యలు తీసుకోవాలని సెంటర్ కు సంబంధం లేకుండా నేరుగా తక్కువ ధరకు రైతుల నుండి కొనుగోలు చేస్తున్న రైస్ మిల్లులపై అధికారులు చర్యలు తీసుకోవాలని గన్ని సంచులు ఇవ్వకుండా రైతులను నష్టపరుస్తున్నారని గన్ని సంచుల ఇవ్వకుండా కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. ఇలాంటి రైస్ మిల్లర్లు వారి నుండి రికవరీ చేయాలని తేమ శాతంతో నిమిత్తం లేకుండా కొనుగోలు వేగవంతం చేయాలని బోనస్ నిధులు వెంటనే విడుదల చేయాలని ఆరు నెలలు గడుస్తున్న ఇప్పటివరకు బోనస్ డబ్బులు బోనస్ డబ్బులు ఇంకా జమ చేయలేదని వెంటనే వాటిని జమ చేయాలని డిమాండ్ చేశారు రైస్ మిల్లర్ల దోపిడిపై త్వరలో జిల్లా కలెక్టర్ దృష్టికి సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు ముదాం అరుణ్ పాల్గొన్నారు.