బందారం టు దర్గా బీటీ రోడ్డుకు శంకుస్థాపన

- అభివృద్ధికి చిరునామా కాంగ్రెస్ పార్టీ - డిసిసి అధ్యక్షురాలు

బందారం టు దర్గా బీటీ రోడ్డుకు శంకుస్థాపన

సిద్దిపేట:

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారం గ్రామంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. మంగళవారం బందారం గ్రామం నుండి దర్గా వరకు దాదాపు 3 కోట్ల 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన బీటీ రోడ్డు పనులకు గ్రామ సర్పంచ్ కొలుపుల గంగాధర్ ఆధ్వర్యంలో శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పనులు ప్రారంభించారు. డీసీసీ అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధికి చిరునామా అని కొనియాడారు. ప్రజల అవసరాలను గుర్తించి, మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. బందారం టు దర్గా రోడ్డు నిర్మాణంతో ఈ ప్రాంత ప్రయాణికుల ఇబ్బందులు తొలగుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కొండపాక మండల మార్కెట్ కమిటీ చైర్మన్ విరూపాక శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ పొట్ట పరశురాములు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వాసరి లింగారావు, తిమ్మారెడ్డి పల్లె సర్పంచ్ కొయ్యడ వెంకటేష్, దర్గా సర్పంచ్ అశోక్ పాల్గొన్నారు. అలాగే నాయకులు సురేందర్రావు, కనక రాములు, మాజీ సర్పంచులు నిమ్మ దుర్గారెడ్డి, పాలడుగు చంద్రారెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగుల వెంకటేష్, గంగుల రాజు, కొలుపుల కనకవ్వ, నీలా హైమావతి, సీనియర్ నాయకులు తోట మాధవరెడ్డి, గంగుల అనిల్, రామ్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కామిరెడ్డి నరసింహారెడ్డి, పెద్ద అంకుల్ శ్రీకాంత్, మెరుగు రాజు, గంగుల మల్లేశం, రాగళ్ల రాజు, బట్ట యాదగిరి మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.WhatsApp Image 2026-04-21 at 19.05.36

About The Author