హుజూర్ నగర్ బి ఆర్ ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు

హుజూర్ నగర్ బి ఆర్ ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు

సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి) జూలై18:
హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో మాజీ జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్ ల ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ శిఖరం మాజీ మంత్రి సూర్యపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని హుజూర్ నగర్ లోని కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో వారి పేరున ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పాత బస్టాండ్ దగ్గర అమరవీరుల స్తూపం సెంటర్ లో కేక్ కట్ చేసి జగదీష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 

ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్ పండ్లు పంపిణీ చేసినారు.అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్యమమే ఊపిరిగా ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉద్యమ నిర్మాణంలో పని చేశారన్నారు. అనంతరం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు మంత్రిగా ఉండి 4వేల మెగా వాట్స్ సామర్థ్యం గల యాదాద్రి పవర్ ప్లాంటు పరిపాలన కేంద్రీకరణలో భాగంగా యాదాద్రి భువనగిరి సూర్యాపేట నూతన జిల్లాల ఏర్పాటు మూడు జిల్లాల్లో మెడికల్ కళాశాల ఏర్పాటు, యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం, కొత్త జిల్లాల్లో నూతన కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసులు, గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేయడంతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలను పట్టిపీడిస్తున్న ఫ్లోరిన్ భూతాన్ని తరిమి వేయడానికి ఇంటింటికి కృష్ణా జలాలను అందించడం ద్వారా వారిలో ఉన్న గొప్ప మానవీయ కోణాన్ని యావత్ తెలంగాణ సమాజం అభినందించిందన్నారు.

Read More నూతన సాంకేతిక విధానంతో ఉద్యాన పంటలను సాగు చేయాలి.

కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను జిల్లాకు తీసుక వచ్చి తుంగతుర్తి, సూర్యపేట, కోదాడ నియోజకవర్గాలకు సాగునీరు అందించి జిల్లాలో రెండు లక్షల 50 వేల ఎకరాల కొత్త ఆయకట్టును సాగులోకి తెచ్చి తెలంగాణ రాష్ట్రంలోనే ఉమ్మడి నల్లగొండ జిల్లాను తెలంగాణ ధాన్యగారంగా మార్చిన ఘనత జగదీష్ రెడ్డి దక్కుతుందన్నారు. అంతేకాక సూర్యాపేట జిల్లా కేంద్రాన్ని ఊహించని విధంగా అభివృద్ధి చేసి ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచారు అన్నారు 2023లో బిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన సూర్యాపేట నుండి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించడమే గాక ఉమ్మడి నల్లగొండ జిల్లా పార్టీకి పెద్దదిక్కుగా నాటి ఉద్యమ సమయం నుండి నేటి ప్రతిపక్ష పార్టీ వరకు పార్టీ క్యాడర్ ను నాయకులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారన్నారు. రానున్న రోజుల్లో జగదీశ్ రెడ్డి ఆయురారోగ్యాలతోని నిండు నూరేళ్లు ప్రజా జీవితంలో ఉండాలని కోరుకుంటున్నామన్నారు.

Read More జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమే పెద్దమ్మ గుడి కూల్చివేత

WhatsApp Image 2025-07-19 at 09.16.45

Read More రైతు భరోసా కింద భూస్వాములకు ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెడుతోంది.. 

ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ కే.ఎల్.ఎన్ రెడ్డి,  బిఆర్ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అబ్దుల్ నబీ, సారెడ్డి భాస్కర్ రెడ్డి,  మాజీ సర్పంచులు అన్నెం శిరీష కొండారెడ్డి, గుజ్జుల సుజాత అంజిరెడ్డి, కీత జయమ్మ, ధన మూర్తి,గల్లా సైదులు, అద్దంకి సైదీశ్వరరావు,షేక్ అలీ, పల్లె నాగిరెడ్డి, మాజీ పిఎసిఎస్ చైర్మన్ కామిశెట్టి వెంకటేశ్వర్లు, రెక్కల శాంబిరెడ్డి, రామిశెట్టి రాము, పారేపల్లి నరసింహారావు, మండల నాయకులు సామల మట్టారెడ్డి, తోట బిక్షం,  మల్లెపల్లి నరసింహారావు, కాసర్ల నాగేశ్వరరావు, సాతులూరు వెంకటేశ్వర్లు,  లక్క వెంకన్న, పంగ నరసింహారావు, చంద్రగిరి రాము, గిన్ రెడ్డి వెంకట్ రెడ్డి, మేరుగా గురవయ్య, రవీందర్ అల్వాల, తమ్మిశెట్టి జయరాం, నరేష్, చంటి,వసంత్, కొరివిరయ్య, సత్యనారాయణ, రాజశేఖర్, వెంకటేష్, నాగరాజు, దుండిగల్ మల్లేష్, చామకూర అంజి ,భాస్కర్, తోరక నరసింహారావు,పల్లె సంతోష్ రెడ్డి, వినాయక రావు, భూతం గిరి, ఎస్కే సైదా, రాము, మహేష్, దుర్గ ప్రసాద్, వేముల అఖిల్, యూత్ నాయకులు సుందరయ్య, భాస్కర్ రెడ్డి, కృష్ణమోహన్, గండు సైదులు, మాడుగుల పరశురాం,  నాగరాజు, దగడు గోపి, లోకేష్ బాబు, దుగ్గి నరసింహారావు, రాము, చడపంగు వెంకటేశ్వర్లు, సీతారాం రెడ్డి,ఎండి ముజీబ్,రమేష్, సుధీర్ రెడ్డి, ఉదయ్ భాస్కర్, మహమ్మద్, ఆకుల పుల్లయ్య, సుందర్, దశరథ, వంశీ, రత్నశ్రీ,రహిమా బేగం, పెద్ద పుష్ప, ఉష, ప్రతి కంఠం భారతి, జూలకంటి రామలక్ష్మమ్మ, లక్ష్మి,నాగమణి,భవాని తదితరులు పాల్గొన్నారు.

Read More రైతులు ధైర్యంగా ఉండండి

About The Author