నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి
మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
ఖమ్మం ప్రతినిది (భారత శక్తి న్యూస్ ), జూలై 18:
నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. మంత్రి ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ పరిధి 37వ డివిజన్ లో మునిసిపల్ సాధారణ నిధులు రూ. 175 లక్షలతో రైల్వే స్టేషన్ దగ్గర్లో నిర్మించనున్న షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు నాణ్యతతో సకాలం లో పూర్తి చేయాలని తెలిపారు. ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా తమ వంతు సహకారం అందించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మొక్కలు పెద్ద ఎత్తున నాటి, వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. రోడ్ల వెడల్పుతో నగరం సుందరంగాను, ప్రజలకు సౌకర్యవంతంగాను ఉంటుందన్నారు. రోడ్ల వెడల్పు తో ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, ఖమ్మం ఆర్డీఓ నరసింహా రావు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.