ఔషద మొక్కలను కాపాడుకుందాం వాటి విలువను తెలుసుకుందాం    

రిటైర్డ్ డూప్యూటీ రేంజ్ ఆఫీసర్ మహుమ్మద్ రఫీయుద్దీన్

ఔషద మొక్కలను కాపాడుకుందాం వాటి విలువను తెలుసుకుందాం    

సూర్యాపేట జిల్లా బ్యూరో(భారత శక్తి) జూలై 18:

సూర్యాపేట జిల్లా కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మరియు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో పర్యావరణం పరిరక్షణలో భాగంగా ఔషధ వనం కూరగాయల తోట, ఇంకుడు గుంత, కంపోస్ట్ పిట్ ల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించుట కోరకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గోలి పద్మ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో రిటైర్డ్ డిప్యూటీ పారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మాహ్మద్ రఫియుద్దీన్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ ఔషద మొక్కలను కాపాడుకుందాం వాటి విలువను తెలుసుకుందామని, ఔషద మొక్కలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలని, ప్రతి విద్యార్థికి ఔషద మొక్కలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు.

Read More కామ్రేడ్ పూనం లింగన్న పోరాట స్ఫూర్తితో ఉద్యమాలను ఉదృతం చేస్తాం..

అనంతరం తులసి, అడ్డసారం మొక్కల గురించి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వాటి ఉపయోగాల గురించి వివరించారు. మన ఇంట్లో ఉన్న ప్రతి మొక్క మనకు ఉపయోగపడేదేనని అందుకే మొక్కల గురించి తెలుసుకోవా లన్నారు.సిజిఆర్ అడ్మిన్ ఆఫీసర్ అనుదీప్ మాట్లాడుతూ ప్రతి పాఠశాల లో ఇంకుడు గుంత, కంపోస్ట్ పిట్, ఔషధ వనం,కూరగాయల తోటలు ఉండాలని అన్నారు. ఈకార్యక్రమం లో మెంటార్ టీచర్ విశ్వజ్ఞచారి, సీజీఆర్ జిల్లా కో.ఆర్డినేటర్ మామిడి శంకరయ్య, కత్తి కోటయ్య ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Read More అరుదైన ఏ నెగటివ్ బ్లడ్ రక్తదానం చేసిన రక్తదాతలు..

About The Author