నిర్మల్ నుండి భైంసా వరకు నాలుగు వరసల (4-లైన్)జాతీయ రహదారికి కి కేంద్రం పచ్చ జెండా

ఫలించిన మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్ ల కృషి...  రోడ్డు విస్తరణతో తీరనున్న ట్రాఫిక్ సమస్య, ప్రమాదాలు

నిర్మల్ నుండి భైంసా వరకు నాలుగు వరసల (4-లైన్)జాతీయ రహదారికి కి కేంద్రం పచ్చ జెండా

భారత శక్తి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో., జూలై 21:
నిర్మల్ నుండి కళ్యాణ్ NH 61 ప్రస్తుత రెండు(2) వరుసల రోడ్డును తెలంగాణ పరిధిలోని 53 కి.మీ లు నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. గతంలో స్థానిక ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్, పాల్వాయి హరీష్, ఎంపీ గోడం నగేష్ డిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ గారికి ఈ రోడ్డు విస్తరణ పనుల పై విన్నవించడం జరిగింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 15 రోడ్లను నాలుగు వరుసల జాతీయ రహదారులుగా నిర్మాణం చేపట్టుటకు రూ. 33,690 కోట్ల వ్యయంతో 2028 సంవత్సరం వరకు పూర్తి చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన పూర్తి DPR ను త్వరగా తయారు చేయాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడమైనది.

ఈ నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణం పూర్తయితే రోడ్డు ప్రమాదాలతో పాటు, ట్రాఫిక్ సమస్యలు కూడా తీరనున్నాయి.  జాతీయ రహదారి విస్తరణలో నిర్మల్ జిల్లా కు ప్రాధాన్యత ఇవ్వడం పట్ల ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్ లు కేంద్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా తెలంగాణలో గడిచిన 11 సం. రాలలో వేల కి.మీ ల జాతీయ రహదారులను కేంద్రం ప్రభుత్వం నిర్మాణం చేపట్టిందని అన్నారు.

Read More పచ్చదనం పెంపొందించడంలో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి

WhatsApp Image 2025-07-22 at 09.31.21

Read More వైష్ణోయ్, ప్రెస్టీజ్ గ్రూపుల అక్రమాలను అరికట్టే నాధుడే లేడా..!

About The Author