మినీ మేడారం జాతర ఏర్పాట్లు పూర్తి, అధికారులు సమన్వయంతో మినీ జాతరను విజయవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్
తాడ్వాయి/ములుగు జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 6: (భారత శక్తి) : ఈ నెల 12 నుండి 15 వరకు ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో జరగనున్న మినీ మేడారం జాతరను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని, వనదేవతలను దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. అన్నారు. గురువారం తాడ్వాయి మండలం లోని మేడారం లో పలు శాఖల అధికారులతో కలిసి వైద్య శిబిరం ఏర్పాటు, జంపన్న వాగు వద్ద స్నాన ఘట్టాలను, మహిళలు బట్టలు మార్చుకోవడానికి ఏర్పాటు చేసిన గదులను పరిశీలించిన అనంతరం గద్దెల ప్రాంతంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతరకు 10 నుండి 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని, నాలుగు రోజులపాటు జరిగే జాతర సందర్భంగా నిరంతరం విద్యుత్ సరఫరా చేయడమే కాకుండా వైద్య సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని తెలిపారు.వైద్య శాఖ సిబ్బంది అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకోవాలని, అత్యవసర సమయాలలో ఇబ్బందులకు గురయ్యే వారిని జిల్లా కేంద్రానికి తరలించడానికి వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. గద్దెల ప్రాంతంలో క్యూలైన్ల వద్ద తొక్కిసలాట జరగకుండా చోరీ సంఘటన జరగకుండా పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జంపన్న వాగు, గద్దెల ప్రాంతం, మేడారం పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్య కార్మికులచే నిరంతరం శుభ్రం చేయించాలని డిపిఓను ఆదేశించారు. భారీ సంఖ్యలో వాహనాలు వచ్చిన పక్షంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలలో వాహనాలు నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలని, నిరంతరం పోలీస్ శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రస్తుతం ఎండలు మండిపోతున్న సందర్భంగా గద్దెల ప్రాంతంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా చలువ పందిర్లను ఏర్పాటు చేయడమే కాకుండా మ్యాట్లను ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. దాదాపు 5 కోట్ల 30 లక్షల రూపాయలతో వివిధ పనులను పూర్తి చేయడం జరిగిందని వివరించారు. జాతరను పురస్కరించుకొని పలుచోట్ల ప్రత్యేకంగా మరుగుదొడ్లను ఏర్పాటు చేశామని, త్రాగునీటి కొరత ఏర్పడకుండా నిరంతరం నీటిని సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. నాలుగు రోజుల పాటు జరిగే జాతరను పురస్కరించుకొని ఆర్టీసీ అధికారులు హనుమకొండ జిల్లా కేంద్రం నుండి నిరంతరం బస్సులను మేడారం నడిపించనున్నారని, జాతరకు వచ్చే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వర్తిస్తుందని తెలిపారు. అమ్మవార్లను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు తమ మొక్కులను చెల్లించుకొని తిరుగు ప్రయాణం కావాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో డిఎస్పి రవీందర్, డిపిఓ దేవరాజ్, డి ఎం అండ్ హెచ్ ఓ గోపాల్ రావు, ఇరిగేషన్ ఈ ఈ నారాయణ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తాడ్వాయి/ములుగు జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 6: (భారత శక్తి) : ఈ నెల 12 నుండి 15 వరకు ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో జరగనున్న మినీ మేడారం జాతరను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని, వనదేవతలను దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. అన్నారు. గురువారం తాడ్వాయి మండలం లోని మేడారం లో పలు శాఖల అధికారులతో కలిసి వైద్య శిబిరం ఏర్పాటు, జంపన్న వాగు వద్ద స్నాన ఘట్టాలను, మహిళలు బట్టలు మార్చుకోవడానికి ఏర్పాటు చేసిన గదులను పరిశీలించిన అనంతరం గద్దెల ప్రాంతంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతరకు 10 నుండి 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని, నాలుగు రోజులపాటు జరిగే జాతర సందర్భంగా నిరంతరం విద్యుత్ సరఫరా చేయడమే కాకుండా వైద్య సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని తెలిపారు.వైద్య శాఖ సిబ్బంది అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకోవాలని, అత్యవసర సమయాలలో ఇబ్బందులకు గురయ్యే వారిని జిల్లా కేంద్రానికి తరలించడానికి వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. గద్దెల ప్రాంతంలో క్యూలైన్ల వద్ద తొక్కిసలాట జరగకుండా చోరీ సంఘటన జరగకుండా పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జంపన్న వాగు, గద్దెల ప్రాంతం, మేడారం పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్య కార్మికులచే నిరంతరం శుభ్రం చేయించాలని డిపిఓను ఆదేశించారు. భారీ సంఖ్యలో వాహనాలు వచ్చిన పక్షంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలలో వాహనాలు నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలని, నిరంతరం పోలీస్ శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రస్తుతం ఎండలు మండిపోతున్న సందర్భంగా గద్దెల ప్రాంతంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా చలువ పందిర్లను ఏర్పాటు చేయడమే కాకుండా మ్యాట్లను ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు.
దాదాపు 5 కోట్ల 30 లక్షల రూపాయలతో వివిధ పనులను పూర్తి చేయడం జరిగిందని వివరించారు. జాతరను పురస్కరించుకొని పలుచోట్ల ప్రత్యేకంగా మరుగుదొడ్లను ఏర్పాటు చేశామని, త్రాగునీటి కొరత ఏర్పడకుండా నిరంతరం నీటిని సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. నాలుగు రోజుల పాటు జరిగే జాతరను పురస్కరించుకొని ఆర్టీసీ అధికారులు హనుమకొండ జిల్లా కేంద్రం నుండి నిరంతరం బస్సులను మేడారం నడిపించనున్నారని, జాతరకు వచ్చే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వర్తిస్తుందని తెలిపారు. అమ్మవార్లను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు తమ మొక్కులను చెల్లించుకొని తిరుగు ప్రయాణం కావాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో డిఎస్పి రవీందర్, డిపిఓ దేవరాజ్, డి ఎం అండ్ హెచ్ ఓ గోపాల్ రావు, ఇరిగేషన్ ఈ ఈ నారాయణ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
