ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క

ములుగు జిల్లా :

WhatsApp Image 2025-09-21 at 6.01.52 PM

ములుగు జిల్లా తాడ్వాయి మండలం లోని మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయం ను మంగళవారం  రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సందర్శించనున్న నేపద్యం లో  చేపట్టాల్సిన ఏర్పాట్ల ను రాష్ట్ర పంచాయితి రాజ్,గ్రామీణాభివృద్ధి, స్ర్తీ- శిశు సంక్షేమ, శాఖల మంత్రి  దనసరి అనసూయ (సీతక్క), జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్,
ఎస్పి షభరిష్ లతో కలిసి  పరిశీలించారు. 

Read More ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని

సమ్మక్క సారలమ్మ దేవాలయం,  కమాండ్ కంట్రోల్ రూమ్ తో పాటు  పరిసర ప్రాంతాలను వీక్షించి ఏర్పాట్లను పకడ్బందిగా చేయాలని అధికారులను సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 23 న మేడారంకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రానున్నారని, ఛాపర్ ద్వారా మేడారం చేరుకుంటారని, సమ్మక్క సారలమ్మ తల్లుల దర్శనం, మేడారం మహా జాతరకు సంబంధించిన పనులనుశంకుస్థాపన, అధికారులు, పూజారులతో సమీక్ష సమావేశం, ప్రెస్ మీట్ అనంతరం గుడి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన, సమ్మక్క సారలమ్మ అభివృద్ధిపై డిజైన్లను విడుదల చేయనున్నరని వివరించారు. సమ్మక్క సారలమ్మ దేవతల పై ముఖ్య మంత్రికి అపార నమ్మకం ఉన్నదని, మేడారం కు ముఖ్య మంత్రి రావడం చాలా సంతోషకరమని తెలిపారు.  ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని విజయవంతం చేయాలని ఆదేశించారు.   

Read More నేటి భారతం :

ఈ సందర్భంగా మంత్రి జిల్లా అధికారులకుపలు సూచనలు చేశారు. ఈ పర్యటనకు జిల్లా అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, ఎస్ పి శబరిష్ ల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి  చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఏ ఎస్ పి శివం ఉపాధ్యాయ, అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి,  గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆర్డీఓ వెంకటేష్, పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గరావు, ఈ ఓ వీరస్వామి, ఏ పి ఓ వసంత రావు, ఇంజనీరింగ్ శాఖల అధికారులు, జిల్లా అధికారులు, మండల అధికారులు,తదితరులు  పాల్గొన్నారు. 

Read More చిన్న నీటి పారుదల వివరాల గణాంక ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

About The Author